చనిపోయిన వారిని హిందువులు దహనం చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

భారతదేశంలో పుట్టిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయమే హిందూ మతం.ఈ హిందూమతంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలను పాటించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

 Why Do Hindus Burn Dead Bodies After A Person Is Died, Hindus, Dead Bodies, Bur-TeluguStop.com

ఈ ఆచారంలో భాగంగానే హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ మతస్తులు ఎవరైనా మరణిస్తే వారికి దహన సంస్కారాలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది.ఈ విధంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు ఎందుకు చేస్తారనే విషయాలు చాలా మందికి తెలియవు.

అయితే చనిపోయిన వారికి ఈ విధంగా దహన సంస్కరణలు ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు వారి వారి మతాలకు అనుగుణంగా సాంప్రదాయ పద్ధతులను పాటిస్తారు.ఈ క్రమంలోనే హిందువులు మరణించిన తరువాత దహన సంస్కారాలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అవి ఏమిటంటే… మనిషి జీవించి ఉన్నప్పుడు తనకు తెలిసి తెలియకుండా ఎన్నో పాపాలను చేస్తారు.ఈ క్రమంలోనే మనిషి చనిపోయిన తర్వాత అతనిని అగ్నిలో దహించి వేయటం వల్ల అతడు జీవించి ఉన్నప్పుడు చేసిన పాపాలు మొత్తం నశించిపోయి వచ్చే జన్మలో పరిశుద్ధమైన ఆత్మతో ఈ భూమిపై పుడతాడని నమ్మకం.అందుకోసమే చనిపోయిన వారిని దహనం చేస్తుంటారు.

చనిపోయిన వారిని ముఖ్యంగా నదులు, చెరువులు, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో మాత్రమే దహనసంస్కారాలు చేస్తుంటారు.

Telugu Burn, Burn Person, Hindu, Hindus, Soul, India-Telugu Bhakthi

ఈ విధంగా నీరు ఉన్నచోట దహనసంస్కారాలు చేయటం వల్ల వారి ఆత్మ పరిశుద్ధం అవడమే కాకుండా చనిపోయిన వ్యక్తి నుంచి ఆత్మ బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా దహనం చేయాలని భావిస్తారు.ఈ విధంగా దహనసంస్కారాలు చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి అస్తికలను నీటిలో కలుపుతారు.ఈ విధంగా నీటిలో కలపడం వల్ల ఆత్మ అంది పంచభూతాలలో కలుస్తుందనేది నమ్మకం.ఇక చివరిగా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు విముక్తి కలిగి వారి ఆత్మ మరొక శరీరం లోనికి ప్రవేశిస్తుంది.

ఈ విధంగా మనిషి చనిపోయినప్పుడు చేసే ఈ ఆచారాలు అన్నింటినీ కలిపి అంతిమ సంస్కరణలుగా భావిస్తాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube