బ్రిడ్జిపై నుంచి కుక్కలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాయి... అసలు అక్కడ ఏముంది..?

Why Do Dogs Commit Suicide Off The Bridge Whats Actually There

ఈ నవీన యుగంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.అనేక విషయాలపై మనకు ఓ క్లారిటీ వచ్చింది.

 Why Do Dogs Commit Suicide Off The Bridge Whats Actually There-TeluguStop.com

కానీ కొన్ని విషయాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు.దానిపై చాలా పరిశోధనలు చేసినా వాటి వెనకున్న విషయాలు బయటకు రావడం లేదు.

కొన్ని అంతుచిక్కని మిస్టరీలు ఇప్పటికే మనకు కనిపిస్తూనే ఉంటాయి.ఇలాంటిదే స్కాట్ లాండ్ దేశంలో ఉంది.

 Why Do Dogs Commit Suicide Off The Bridge Whats Actually There-బ్రిడ్జిపై నుంచి కుక్కలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాయి… అసలు అక్కడ ఏముంది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ ఉన్న ఓ బ్రిడ్జి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.కానీ దీని వెనుక పెద్ద మిస్టరీయే ఉంది.

వెస్ట్ డర్బన్ స్లయర్‌లోని ఓవరటన్ హౌస్‌కు వెళ్లే దానిలో ఉంది ఈ బ్రిడ్జి.దీనిని 1895లో నిర్మించారు.

కానీ 1960 సంవత్సరం నుంచిబ్రిడ్జిపై వింత చోటుచేసుకుంటూనే ఉంది.ఆ బ్రిడ్జి మీదకు వచ్చి కుక్కలు అమాంతం అందులోకి దూకేస్తున్నాయి.

ఇప్పటి వరకు అలా సుమారు 50కి పైగా చనిపోయాయి.మరో ఆరు వందల కుక్కలకు గాయాలయ్యాయి.

కుక్కలు ఎందుకు ఇలా చేస్తున్నాయనే విషయం ఎవరికీ తెలియడం లేదు.దీనిపై కొందరు సైంటిస్టులు సైతం పరిశోధనలు చేశారు.కుక్కలు ఎక్కడైనా సూసైడ్ చేసుకుంటాయా? అంటూ ప్రశ్నలను లేవనెత్తారు.కాని కుక్కలు ఎందుకిలా దూకుతున్నాయన్న విషయం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

అయితే కుక్కలు ఎందుకిలా చేస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేశంలోని ఓ జంతు ప్రేమికుల సంస్థ ప్రయత్నాలు చేపట్టింది.కానీ వారికి సైతం ఎలాంటి ఆధారాలు లభించలేదు.

బ్రిడ్జిపై దయ్యం ఉందని చాలా మంది అక్కడ ప్రచారం చేస్తున్నారు.అందుకే కుక్కలు ఆత్మహత్య చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

మరి కొందరు మాత్రం ఆ బ్రిడ్జికి కుక్కలు అంటే పడటం లేదని అందుకే ఇలా జరుగుతోందంటూ చెబుతున్నారు.మరి అసలు మిస్టరీ ఏంటి అనేది మాత్రం బయటపడటం లేదు.

#Dogs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube