చీమలు గుంపులుగా ఎందుకు వెళ్తాయి.? అవి దారితప్పకుండా ఎలా ఉంటాయి అంటే.?   Why Do Ants Walk In A Line?     2018-07-17   11:42:45  IST  Sainath G

చీమలు సంఘజీవులు. ఎప్పుడూ బారులు బారులుగా వెళుతుంటాయి. ఎక్కడ ఆహారపు పదార్థం ఉన్నట్లు పసిగట్టినా చటుక్కునా వెళ్లిపోతాయి. తమ బరువుకన్నా ఎన్నో రేట్లు బరువున్న ఆహార పదార్దాన్ని కష్టపడి చాల దూరం వెతుకుతూ ఆహారాన్ని మోస్తూ బారులుగా తిరిగి తమ పుట్టలోకి వెళ్లిపోతాయి.

కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ఒక్కొక్కసారి మానమయినా దారి తప్పుతాము గాని, చీమలు మత్రం దారి తప్పకుండా మల్లి తమ పుట్టలోకి వచ్చేస్తాయి.

అవి దారిని గుర్తుపెట్టుకోడానికి ఒక రకమైన జిగురును దారి వెంట వదులుకుంటూ వెళతాయి. తిరిగి వచ్చేటప్పుడు ఆ జిగురు వాసన చూసుకుంటూ తికమక పడకుండా నేరుగా వచ్చేస్తాయి. అందుకే అవి వరుసగా వస్తుంటాయి. అవి వెళ్లే దారిలో ఏదైనా నీటి ప్రవాహంలాంటిది సంభవించినపుడు అవి వందలాదిగా కలిసి ఉండచుట్టుకొని దొర్లు కుంటూ సురక్షితంగా వచ్చేస్తాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.