కేకేఆర్ కెప్టెన్సీ నుండి దినేష్ కార్తీక్ ఎందుకు తప్పుకున్నాడంటే…?!  

why dinesh karthik left kkr captaincy kkr, dinesh karthik, ian morgan, ipl2020 - Telugu Dinesh Karthik, Ian Morgan, Ipl2020, Kkr

తాజాగా ఐపిఎల్ 13 సీజన్ నువ్వా.నేనా.

TeluguStop.com - Why Dinesh Karthik Left Kkr Captaincy

అన్నట్లుగా సాగుతోంది.అయితే తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ టీం జట్టు కెప్టెన్ గా దినేష్ కార్తీక్ తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ స్థానాన్ని ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ ను ఎంపిక చేశారు.తాజాగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కి ముందు ఈ మార్పు చోటు చేసుకుంది.

TeluguStop.com - కేకేఆర్ కెప్టెన్సీ నుండి దినేష్ కార్తీక్ ఎందుకు తప్పుకున్నాడంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఒక ఇందుకు సంబంధించి ప్రస్తుత కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు.ముంబాయి ఇండియన్స్ తో మ్యాచ్ జరిగిన సమయంలో టాస్ వేసిన సందర్భంగా మోర్గాన్ మాట్లాడుతూ దినేష్ కార్తీక్ తీసుకున్న నిర్ణయం నిస్వార్ధమైన చర్య అని చెప్పుకొచ్చాడు.

దాంతో పాటు ఆయన జట్టు యాజమాన్యం పై ప్రశంసల వర్షం కురిపించాడు.జట్టులోని ప్రతి ఆటగాడికి తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపేందుకు మంచి వాతావరణాన్ని ఇచ్చిందని జట్టు యాజమాన్యం పై ప్రశంసల వర్షం కురిపించాడు.

దినేష్ కార్తీక్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ తో ముందు రోజు తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు.ఇక పై బ్యాటింగ్ కు ఎక్కువ దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు దినేష్ కార్తీక్.

ఇది ఎంతో చాలా నిస్వార్ధమైన నిర్ణయం అని తెలిపాడు.ఇలా చేయడానికి ఎంతో ధైర్యం కావాలని.

అది కార్తీక్‌లో ఉందంటూ తెలిపాడు.కేకేఆర్ జట్టు ప్రయోజనాలకు అతడు మొదటి ప్రాధన్యత ఇస్తాడని మోర్గాన్ తెలిపాడు.

డ్రెస్సింగ్ రూమ్ లో ప్రపంచస్థాయి జట్టుకు మంచి నాయకులు అవసరమని, అందుకు తగ్గట్టుగానే కోల్కత్తా నైట్ రైడర్స్ లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు.ఇకపోతే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపాడు.

ఇదివరకు ఇయాన్ మోర్గాన్ కోల్కత్తా నైట్ రైడర్స్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు.అయితే దినేష్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మోర్గాన్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు.

దినేష్ కార్తీక్ ను 2018లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కొనుగోలు చేయగా 2018 నుంచి అతనికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.కాకపోతే గత సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ అనుకున్నంత రాణించలేకపోయింది.

అయితే ప్రస్తుతానికి మొత్తం ఎనిమిది మ్యాచ్ల్ లలో ఆడగా నాలుగింట విజయం సాధించి నాలుగింట ఓటమిపాలైంది.దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కోల్కత నైట్ రైడర్స్ నిలిచింది.

తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల విజయాన్ని అందుకుంది.

#IPL2020 #Ian Morgan #Dinesh Karthik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Why Dinesh Karthik Left Kkr Captaincy Related Telugu News,Photos/Pics,Images..