రాజు గారు ఎక్కడున్నారు... అన్ని వచ్చాయి మరి వకీల్‌ సాబ్‌ ఎప్పుడు బాసూ

గడచిన వారం రోజుల్లో పెద్ద చిన్న కలిపి దాదాపు డజనుకు పైగా సినిమాల విడుదల తేదీలు వచ్చాయి.మార్చి నుండి మొదలుకుని వచ్చే సమ్మర్ వరకు సినిమాల విడుదల జాతర కనిపిస్తుంది.

 Why Dill Raju Silent In Vakeel Saab Release , Dill Raju , Vakeel Saab Release Da-TeluguStop.com

వచ్చే ఏడాది సినిమాల విడుదల తేదీల విషయంలో కూడా క్లారిటీ ఇస్తున్నారు.కాని ఇప్పటి వరకు దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్‌ సాబ్‌ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యింది.గత ఏడాది సమ్మర్‌ లోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉంది.

కాని కరోనా కారణంగా ఆగిపోయింది.మళ్లీ ఇన్నాళ్లకు సినిమా విడుదల తేదీల హడావుడి కనిపిస్తుంది.

కాని వకీల్ సాబ్‌ విడుదల తేదీ విషయంలో మాత్రం ఎందుకో నిర్ణయంను తీసుకోవడంలో నిర్మాత దిల్‌ రాజు ఆలోచనల్లో పడ్డాడు.సినిమాను ఎంత మనసు పెట్టి నిర్మిస్తాడో అంతే జాగ్రత్తగా విడుదల తేదీని కూడా దిల్‌ రాజు ఖరారు చేస్తాడు.

అందుకే వకీల్‌ సాబ్ సినిమా విడుదల తేదీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Acharya, Dill Raju, Kgf, Netizens, Pawan Fans, Pawan Kalyan, Vakeel Saab,

మొన్నటి వరకు వకీల్‌ సాబ్‌ ఏప్రిల్‌ లో ఆచార్య సినిమాను మే లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఆలస్యంగా విడుదల కాబోతున్న ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాని వకీల్‌ సాబ్‌ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.వకీల్‌ సాబ్ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది.

కనుక సినిమా విడుదల తేదీ విషయంలో అతి త్వరలోనే ఏదో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను నమోదు చేసిన పవన్‌ కళ్యాణ్‌ మూడు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.

ఎట్టకేలకు ఈ సినిమాతో రాబోతున్నాడు.కనుక ఖచ్చితంగా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతాయని అంతా నమ్మకంగా ఉన్నారు.

ఇక వకీల్ సాబ్‌ సినిమా చిత్రీకరణ విషయంలో నెలకొన్న కొన్ని అవాంతరాలు అన్ని తొలగి పోయి విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పుడేమో విడుదలకు అవాంతరాలు ఎదురవుతున్నాయా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube