అసలెందుకు మీరు అలా ట్రై చేయలేదు.. హరితేజకు నెటిజన్ ప్రశ్న?

బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకులందరికీ బాగా పరిచయం ఉన్న నటి.యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.

 Why Didnt You Try That Netizens Question To Hariteja ,hariteja , Manasu Mamatha-TeluguStop.com

తొలిసారిగా 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.తన నటనకు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.2011లో బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెరపై పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.

బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.

ఇక ఈమెకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.

ఈ మధ్య గ్లామర్ లుక్ తో కూడా దర్శనమిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది.

ఇప్పటికే తను ఒక బిడ్డకు తల్లి.ఇక తన కుటుంబం కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఉంటుంది.

కానీ ఆమె మాత్రం గ్లామర్ ను బయట పెట్టింది.కానీ తనపై వచ్చే ట్రోల్స్ ను మాత్రం అసలు పట్టించుకోదు హరితేజ.

Telugu Biggboss, Hariteja, Manasumamatha, Actress-Movie

ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.తన డాన్సులతో మాత్రం అందర్నీ ఫిదా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.ఇందులో తాను లంగా వోణీ ధరించగా ఆ ట్రెడిషనల్ డ్రెస్సులో మాత్రం చాలా అందంగా ఆకట్టుకుంది హరితేజ.

ఇక ఆ వీడియో చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్.అసలు మీరు ఎందుకు హీరోయిన్గా ట్రై చేయలేదు  చెప్పండి.

ఫస్ట్ మీ యాక్టింగ్ సూపర్.మీ వాయిస్ లో ఒక పవర్ ఉంది.

గుడ్ యాక్టింగ్, గుడ్ డాన్సర్, గుడ్ సింగర్ అంటూ మీరు భవిష్యత్తులో పెద్ద స్టార్ కావాలని అనుకుంటున్నాను అని తనకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube