మూత్రం తాగితే బరువు తగ్గుతారట, ఎవరి మూత్రం వారు తాగితే రోగాలు రావని ప్రధాని చెప్పిన మాటలను 20ఏళ్లుగా తూచా తప్పకుండా పాటిస్తున్న గ్రామప్రజలు  

Why Did The Indian Prime Minister Morarji Desai Drink Urine-

మూత్రం తాగితే బరువు తగ్గుతారని తాము ఆ విధంగానే తగ్గామని ఇటీవల యూఎస్‌లోని ఇదహో స్టేట్‌కు చెందిన కొంతమంది ఈ పద్ధతిని ప్రమోట్ చేస్తున్నారు.ఇదహోకు చెందిన ఓ వాతావరణ నిపుణుడు ఇలాగే మూత్రం తాగి 13 కిలోలు బరువు తగ్గాడట.తనకు ముఖానికి ఉన్న మొటిమలు కూడా తగ్గిపోయాయట.అతడిని చూసి మరో వ్యక్తి జులియా కూడా మూత్రాన్ని తాగి 12 కిలోలు తగ్గాడట.అతడి ముఖం కూడా తేజోవంతం అయిందట..

Why Did The Indian Prime Minister Morarji Desai Drink Urine--Why Did The Indian Prime Minister Morarji Desai Drink Urine-

మొటిమలు పూర్తిగా తగ్గిపోయాయట.బరువు తగ్గడం కోసం మూత్రం తాగడం ఇదే కొత్తేమీ కాదు.ఇది వందల ఏండ్ల నుంచి ఉన్న ప్రక్రియే అంటూ.ఇది బరువు తగ్గించడమే కాదు.

మనిషిని మళ్లీ తన యవ్వనంలోకి తీసుకెళ్తుందంటూ కొంతమంది ప్రచారం కూడా చేసేస్తున్నారు…వారి మాటేమో కానీ మన దేశ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎవరి మూత్రం వారు సేవించడం వలన ఎలాంటి రోగాలు దరిచేరవని, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారని తాను తన మూత్రం సేవిస్తున్నాని, చాలామందికి చెప్పేవాడు.ఆయన మాటలను కొందరు తిరస్కరించగా,ఒక గ్రామప్రజలు మాత్రం 20 యేళ్ళుగా ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని అమర్పూర్ అనే ఈ గ్రామంలో వాళ్ళు నీటికి బదులుగా తమ మూత్రాన్ని తాగుతున్నారు.ఈ విషయం వారికి తప్పుగా మరియు ఇదేదో శిక్షలా అనిపించడంలేదు.కాగా తమకు ఇదే మంచిదని భావిస్తున్నారు.

అప్పటి దేశ ప్రధాని మొరార్జీ దేశాయ్, ఎవరి మూత్రం వారు సేవించడం వలన చాలా రోజులుగా నయంకాని రోగాలు నయమవుతాయని, ఇక వ్యాధులు దరిచేరవని చెప్పాడు.అంతేకాదు ఆయన తన మూత్రాన్ని తాను తాగేవాడట.ఇలా చేయడం వలన వ్యాధులు తొలగిపోవడమే కాకుండా,కంటిని మూత్రంతో శుభ్రం చేసుకుంటే కంటి శుక్లం సమస్యలు కూడా రావని ఆయన చెప్పిన మాటలను అమర్పూర్ గ్రామానికి చెందిన ప్రజలు అప్పటి నుండి అదే అనుచరిస్తున్నారు.తమ మూత్రాన్ని తామే తాగుతున్నారు.దీని వలన ఎలాంటి వ్యాధులు తమ ఒంటికి సోకవని,ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు..

అయితే కొందరు వైద్య పరిశోధకులు ఇలా చేయడం తప్పని ఆరోగ్యానికి ప్రమాదమని చెప్పినా, ఆ విషయం గురించి అక్కడి ప్రజలు ఖాతరు చేయడం లేదు.ఇంకా ఇలా సేవించడం వలన తమ కండదారుడ్యం బలంగా ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.

ఆ గ్రామజనాభా మొత్తం 7 లక్షల మంది ఉంటారు.కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి ఏదో అంతుచిక్కని వ్యాధి సోకింది.

వైద్యులకు చూపిస్తే చేతులెత్తేశారు.ఆ రోగం అలా రోజురోజుకు అందరికీ చుట్టుకుంది.ఆ వ్యాధిని ఎలా అరికట్టాలో తెలియలేదు వారికి.

ఆ ఊరిలో నివసించే ఒక పెద్దాయన మొరార్జీ చెప్పిన మాటలను చెప్పాడు.చాలా రోజుల నుండి నయం కాని రోగాలు, తమ మూత్రం సేవించడం వలన తగ్గిపోతాయని.ఇక జీవితంలో మళ్ళీ రోగాల బారినపడమని ఆయన చెప్పాడు.

అయితే ఆ పెద్దమనిషి చెప్పిన మాటలను మొదట అందరూ తిరస్కరించారు.ఆ వ్యాధి సోకిన వారు, మూత్ర్రం సేవించిన తర్వాత ఆరోగ్యంగా ఉండడంతో ఇక అందరూ తమ మూత్రాన్ని సేవించడం మొదలుపెట్టారు.అలా గత 20 ఏళ్ళుగా తమ మూత్రాన్ని వారు సేవిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు.ఎలాంటి రోగాలకైనా మూత్రమే ఔషధమని దాహంవేసినా, అలసినా మూత్రమే సేవిస్తున్నారు.

వైద్య పరిశోధకులు పరిశోధనలు చేసి మూత్రం సేవిస్తున్న విషయం గురించి ఒక నివేదికను రూపొందించారు.అందులో వారు ఏం చెప్పారంటే మానవుడి శరీరం నుండి బయటకు వెలువడే మూత్రంలో 95%నీరు, మిగిలన 5%శరీరానికి హానిచేసే క్రిములు, వ్యర్థ పదార్థాలు ఉంటాయి.అందుకని ఎట్టి పరిస్థులలోనూ మానవుడు తన మూత్రాన్ని సేవించకూడదని, హానికరమని చెబుతున్నారు.అయితే ఎంతమంది వైద్యులు ఈ విషయం చెప్పినా ఆ గ్రామ ప్రజలు మాత్రం వినకుండా వారు అనుకున్నది,నమ్మినదే చేస్తున్నారు.