నటుడు నరేష్ మూడు పెళ్లిళ్లు ఎందుకు పెటాకులయ్యాయి.. పవిత్ర లోకేష్ తో సహజీవనమేనా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.గత కొంతకాలంగా వీరిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారారు.

 Why Did Senior Naresh Have To Get Married Three Times Details, Pavitra Lokesh, Naresh, Tollywood, Marriage, Three Times Married, Senior Naresh Marriages, Naresh Pavitra Lokesh, Rekha, Ramya, Suchendra Prasad,-TeluguStop.com

వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ కొందరు అంటుంటే.లేదు వీరు సహజీవనం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.

ఈ విషయం గురించి పవిత్ర లోకేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించి ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం పవిత్ర లోకేష్ నరేష్ తో కలసి ఉంటున్న విషయం నిజమే అంటూ చెప్పుకొచ్చింది.

 Why Did Senior Naresh Have To Get Married Three Times Details, Pavitra Lokesh, Naresh, Tollywood, Marriage, Three Times Married, Senior Naresh Marriages, Naresh Pavitra Lokesh, Rekha, Ramya, Suchendra Prasad, -నటుడు నరేష్ మూడు పెళ్లిళ్లు ఎందుకు పెటాకులయ్యాయి.. పవిత్ర లోకేష్ తో సహజీవనమేనా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరూ ఇప్పుడు సహజీవనం చేస్తున్నారని, అందుకు కృష్ణ కుటుంబ సభ్యుల నుండి కూడా ఆమోదం ఉందని ఆవిడ వెల్లడించారు.

అంతేకాకుండా తన మొదటి భర్త గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తన మొదటి భర్తని కూడా ఆమె అధికారికంగా వివాహం చేసుకోలేదని అతనితో కూడా సహజీవనం చేశానని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చింది.ఇక నరేష్ విషయానికి వస్తే.ఇప్పటివరకు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.మొదట ప్రముఖ కెమెరామెన్ కుమార్తె రేఖని పెళ్లి చేసుకున్న నరేష్ కొంతకాలానికి ఆమెకు విడాకులు ఇచ్చాడు.

ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న నరేష్ ఆమెతో కూడా మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చాడు.ఇక 50 ఏళ్ల వయసులో మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కూతురైన రమ్యని వివాహం చేసుకున్నాడు.

Telugu Naresh, Nareshpavitra, Pavitra Lokesh, Ramya, Rekha, Seniornaresh, Times Married, Tollywood-Latest News - Telugu

చాలా కాలంగా వీరిద్దరూ కూడా వేరుగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు విడాకులు తీసుకోలేదు.ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురి భార్యలతో విసుగు చెందిన నరేష్ పెళ్లి మీద విరక్తితో ఉన్నాడు.అందువల్ల ప్రస్తుతం ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం మాత్రమే చేస్తున్నాడు అంటూ సమాచారం.తన మూడు విడాకుల గురించి స్పందించిన నరేష్.తన జీవితం చాలా బిజీగా ఉంటుందని, తన సినిమా జీవితాన్ని, షూటింగ్ సమయాన్ని అర్థం చేసుకున్న వారే నాతో పాటూ ఉంటారు.మిగతా వాళ్లు విడిపోతారు.

అందుకే నాకు మూడు విడాకులు అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు.ఈ విధంగా మూడు పెళ్లిళ్ల గురించి ఆ పెళ్లిళ్లు కాస్త పెటాకులు కావడం గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube