వైరల్ పిక్: వీధి కుక్కకు గొడుగు పడితే రతన్ టాటా ఎందుకు రియాక్ట్ అయ్యాడబ్బా..?!

ప్రస్తుత పరిస్థితులలో ఎవరి జీవితం వారు చూసుకుంటున్నారు.బంధుత్వాలు, బాంధవ్యాలు మరిచిపోతున్నారు.

 Why Did Ratan Tata React If An Umbrella Fell On A Street Dog ..?! Ratan Tata, Vi-TeluguStop.com

సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం మానేసి సింపుల్ గా వారిని చూసి అయ్యో పాపం అంటున్నారే కానీ వారికి తోచిన సహాయం చేసి వారి కష్టాలను కొంతవరకు అయిన తీర్చాలని మాత్రం ఎవరు అనుకోవడం లేదు.ఎవరు ఎలా చస్తే నాకెందుకు నేను, నా కుటుంబం బాగుంది అది చాలు అని బతికేస్తున్నారు.

మనుషులు కష్టాల్లో ఉంటేనే ఆదుకొని వారు ఇంకా జంతువులు కష్టాల్లో ఉంటే ఎలా ఆదుకుంటారు చెప్పండి.అయితే అందరు కూడా ఎవరు ఎలా పోతే నాకేంటి అనే ధోరణిలో ఉండరు.

 Why Did Ratan Tata React If An Umbrella Fell On A Street Dog ..?! Ratan Tata, Vi-TeluguStop.com

కొంతమంది మాత్రమే సాటి మనిషి కష్టాల్లో ఉంటే చూడలేరు.ఆ కొంతమందిలో ఈ వ్యక్తి కూడా ఒకడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

మనిషికి మనిషి సహాయం చేయలేని ఈ రోజుల్లో ఒక నోరులేని ముగ జీవానికి ఈ వ్యక్తి సహాయం చేసి ఏకంగా బిజినెస్ ఐకాన్ రతన్ టాటానే ఇంప్రెస్ చేసాడు.ఇంతకీ అతను చేసిన పని ఏంటో తెలుసా ఒక విధి కుక్క జోరు వర్షంలో తడిచి ముద్ద అవుతుతుంటే అది గమనించిన ఒక ఉద్యోగి ఆ తన దగ్గర ఉన్న గొడుగు పట్టి కుక్క వర్షపు నీటిలో తడవకుండా కాపాడాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఎంత వైరల్ అయిందంట ఏకంగా ఈ ఫోటోను రతన్ టాటా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ లో షేర్ చేసే అంత ఫేమస్ అయిందన్నమాట.

అలాగే ఈ ఫోటోను షేర్ చేయడంతో పాటు ఇది చాలా బెస్ట్ మూమెంట్ అని కామెంట్ కూడా చేసారు.

Telugu Ratan Tata, React, Umber Alla, Latest-Latest News - Telugu

కాగా ఆ వ్యక్తికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.కుక్కను కాపాడిన వ్యక్తి ముంబై లోని తాజ్ హోటల్ కి చెందిన ఉద్యోగిగా తెలుస్తుంది.వర్షంలో తడుస్తున్న కుక్కని చూసి చలించిపోయి కుక్క తడవకుండా గొడుగు పట్టిన ఫోటో రతన్ టాటా దృష్టికి రావడంతో ఆయన ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

మామూలుగానే రతన్ టాటాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం.ఇప్పటికి ఆయన చాలా రకాల పెంపుడు జంతువులను పెంచుతున్నారు.ఈ క్రమంలోనే ఉద్యోగి చేసిన పని రతన్ మనసును బాగా ఆకట్టుకుంది.సాధారణంగా విధి కుక్కలను ఎవరు పట్టించుకోని తరుణంలో తాజ్ ఉద్యోగి చేసిన ఈ మంచి పనిని నేను అభినందిస్తున్నా అని రతన్ టాటా ఆ ఉద్యోగిని అభినందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube