టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మొన్నటివరకూ బిజెపికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం అందరికీ తెలిసిందే.2019 ఎన్నికల టైంలో జాతీయ రాజకీయాలలో రాణించాలని కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కూడా అప్పట్లో ప్రయత్నాలు చేయడం జరిగింది.దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వంటి వాటిని తుద్దముటీంచాలని కేసీఆర్ అప్పట్లో పిలుపునివ్వడం జరిగింది.అంత మాత్రమే కాక జాతీయ స్థాయిలో కీలక నేతలతో కూడా కేసీఆర్ భేటీ కావడం ఆ టైం లో సంచలనం సృష్టించింది.
ఈ విధంగా మొన్నటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసిఆర్ భారీ స్థాయిలోనే హడావిడి చేశారు.కానీ తాజాగా కేసిఆర్ ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను స్వయంగా కేసీఆర్ వ్యతిరేకించాగా…, తాజాగా రైతు చట్టాలకు కేసిఆర్ ప్రభుత్వం మద్దతు తెలపటం అందరికి షాక్ కి గురి చేసింది.ఇదంతా ఒక ఎత్తు అయితే యువ నాయకుడు కేటీఆర్ బిజెపి- టిఆర్ఎస్ పార్టీలు కలిసి అడుగులు వేయాలని స్నేహ గీతం ఆలపించాడం మరొక ఎత్తు.
ఈ పరిణామంతో బిజెపి పార్టీకి కేసిఆర్ ఎందుకు తలొగ్గారు అనే చర్చలు తెలంగాణ రాజకీయాల్లో మొదలయ్యాయి.
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో కేసిఆర్ జైలుకి వెళ్తాడు అని కామెంట్లు చేయటంతో ఆ తర్వాత కేసిఆర్ బిజెపి వ్యవహారంలో మార్పులు రావటంతో.
తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సంథింగ్ ఏదో పెద్దదే జరిగే అవకాశం ఉందని మరోపక్క పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఏది ఏమైనా బీజేపీపై మొదటిలో దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ తాజాగా చల్లబడటం, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గటం అనేక అనుమానాలకు తావిస్తోంది అనే టాక్ రాజకీయవర్గాలలో వస్తోంది.