మెగాస్టార్ ఇంతలా ఎందుకు మారారు?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Why Did Chiranjeevi Get Makeover, Chiranjeevi, Acharya, Ram Charan, Kajal Aggarw-TeluguStop.com

అయితే ఈ సినిమాలో చిరు అదిరిపోయే లుక్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతుండటంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా కోసం చిరు ఎవరూ ఊహించని విధంగా మేకోవర్ చేసుకున్నాడు.

తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఫోటోలో చిరు చాలా ఎనర్జిటిక్‌గా, చాలా రిఫ్రెషింగ్‌గా కనిపిస్తున్నారు.

దీనికి బలమైన కారణం కూడా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన యాక్టింగ్ పార్ట్ పూర్తి కావడంతో, త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ కాజల్‌తో ఓ అదిరిపోయే సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

దీని కోసమే చిరు తన లుక్‌ను కాస్త రిఫ్రెషింగ్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సాంగ్ షూటింగ్ విశాఖపట్నంలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సాంగ్ షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమా పూర్తి కాగానే చిరంజీవి వెంటనే లూసిఫర్ రీమేక్ చిత్రంలో పాల్గొంటారు.

బహుశా ఆ సినిమాలో కూడా ఇదే రిఫ్రెషింగ్ లుక్‌లో చిరు మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఒకవేళ ఇందుకోసమే చిరు ఇలా కొత్తగా కినిపిస్తున్నాడేమో అని వారు అంటున్నారు.

ఏదేమైనా చిరంజీవిని ఇంత రిఫ్రెషింగ్ లుక్‌లో చూసిన ఆయన అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.ఇక త్వరలోనే ఆయన పుట్టినరోజు రానుండటంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube