కాకులను పూర్వీకులుగా భావించడానికి గల కారణం ఏమిటి? పిండప్రధానంలో కాకికి ఎందుకంత ప్రాముఖ్యత?

భాద్రపద మాసం పౌర్ణమి నుంచి 15 రోజులను మహాలయ పక్షము అంటారు.మహాలయ పక్షంలో ఏదో ఒకరోజున మన పూర్వీకులకు పిండ ప్రధానం చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి అన్ని శుభఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

 Why Crows Are Considered To Be The Form Of Ancestors, Ancestors, Crows, Crows Hi-TeluguStop.com

అయితే ఈ పిండప్రధానం సమయంలో కాకిని ఎంతో పవిత్రమైన పక్షిగా భావిస్తారు.పిండ ప్రధాన సమయంలో కాకులను సాక్షాత్తు పూర్వీకులుగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో మన పూర్వీకులకు పూజ చేసి పెట్టిన పిండాన్ని కాకులకు పెడుతుంటారు.

అసలు కాకులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏమిటి.పిండప్రధానంలో కాకికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హిందూ సాంప్రదాయాల ప్రకారం కాకిని మన పూర్వీకులుగా భావిస్తారు.మన పూర్వీకులకు పిండ ప్రదానం చేసే సమయంలో కాకులు వెనుకభాగం వైపు వస్తే సాక్షాత్తు పూర్వీకులే అక్కడికి వచ్చారని భావిస్తారు.

అసలు ఈ కాకి పూర్వీకులకు సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే… త్రేతాయుగంలో ఇంద్రుడి కుమారుడు జయంత్ కాకి రూపంలో సీతాదేవి కాలికి గాయం చేస్తాడు.ఇలా సీతాదేవికి గాయమవడంతో శ్రీరాముడు కాకి కన్ను పొడవటంతో తన తప్పును గ్రహించిన జయంత్ తనని మన్నించమని వేడుకున్నాడు.

అతడి మన్నిక మేరకు శ్రీరాముడు ఈరోజు నుంచి మీకు అందే ఆహారం పూర్వీకులకు దక్కుతుందనే వరం ఇచ్చారు.

అప్పటి నుంచి కాకులను మన పూర్వీకులుగా భావిస్తున్నారు.అందుకోసమే అప్పటి నుంచి మన చనిపోయిన పెద్దవారికి పిండప్రదానాలు చేసిన తర్వాత కాకులకు ఆ పిండాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.అలా కాకులు తినడం వల్ల ఆ పిండాన్ని మన పెద్దవారికి చెందుతుందని వారి ఆత్మ తృప్తి పొందుతుందని తెలియజేస్తున్నారు.

ఆధ్యాత్మికంగా కాకిని ఈ విధంగా పూర్వికులతో పోల్చడం వల్ల వాటికి ఆహారం లభిస్తుందని పరిజ్ఞానంగా మరి కొంతమంది భావిస్తారు.అయితే పిండ ప్రధాన సమయంలో కాకులు లేని పక్షంలో గ్రద్ద, లేదా ఆ పిండాన్ని జలచరాలకు అంటే నీటిలో వదలడం వల్ల శుభం కలుగుతుంది.

Why Crows Are Considered To Be The Form Of Ancestors, Ancestors, Crows, Crows History, Pitru Paksha 2021, Crows As Ancestors, Ancestors, Telugu Bhakthi, Hindu Rituals, Peace To Ancestors Soul - Telugu Ancestors, Crows, Crows Ancestors, Hindu Rituals, Ancestors Soul, Pitru Paksha, Telugu Bhakthi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube