సీఎం భార్యతో ఎందుకు స్వామివారిని దర్శించుకోరు?  

why cm jagan not to do darshana with his wife, Ap Cm Jagan, BJP Leaders, Trirumala, Kodali Nani, TDP, Nimmala Ramanaidu, Jagan Wife - Telugu Nimmala, Tdp, Tirumala, Ttd, Venkateshwara Swamy, Ys Jagan

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్బంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు.ఈ సందర్బంగా డిక్లరేషన్‌ విషయమై గత రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది.

TeluguStop.com - Why Cm Jagan Not To Do Darshana With His Wife

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాతే పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ సందర్బంగా హిందూ సంఘాల వారు కూడా ఈ విషయమై సీఎం జగన్‌ పై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుడు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - సీఎం భార్యతో ఎందుకు స్వామివారిని దర్శించుకోరు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిమ్మల మాట్లాడుతూ.

హిందూ సాంప్రదాయం ప్రకారం స్వామి వారిని దర్శించుకునేందుకు ఎవరైనా సతీసమేతంగా వెళ్లాలి.అది ఆనవాయితీగా వస్తుంది.

మరి సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం జగన్‌ మోహన్‌ గారికి ఉన్న అభ్యంతరం ఏంటీ.ఎందుకు ఆయన భార్యతో కలిసి స్వామి వారిని దర్శించుకోరు అంటూ ప్రశ్నించారు.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్వామి వారి సాంప్రదాయాలను అగౌరవ పర్చడం ఏమాత్రం సరి కాదని ఈ విషయంలో సీఎం జగన్‌ పునరాలోచించుకోవాలని.డిక్లరేషన్‌ ఇచ్చిన తర్వాత స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించాలని అన్నారు.

ఇదే సమయంలో సతీ సమేతంగా పట్టు బట్టలు స్వామి వారికి సమర్పిస్తే మరింత మంచి జరుగుతుందంటూ టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Tirumala #YS Jagan #Nimmala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Why Cm Jagan Not To Do Darshana With His Wife Related Telugu News,Photos/Pics,Images..