చిరు చేయాల్సిన సినిమా వెంకటేష్ చేసాడు.. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది?

ఇప్పుడైతే స్టార్ హీరోలతో సినిమాలు తీసినా పక్కగా హిట్ అవుతాయన్న నమ్మకం మాత్రం ఉండటం లేదు.కానీ ఒకప్పుడు మాత్రం స్టార్ హీరోతో సినిమా అంటే ఇక కమర్షియల్ విజయం ఖాయం అని అనుకునేవారు.

 Why Chiru And Venky Movie Fall In Legal Issues Details, Chiranjeevi, Venkatesh ,-TeluguStop.com

ప్రేక్షకులు కూడా స్టార్ హీరోలను చూసే సినిమా థియేటర్లకు తరలివెళ్లారు.అయితే ఇప్పుడు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేస్తున్నాడు.

కానీ ఒకప్పుడు నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ చిరంజీవి నలుగురు కూడా స్టార్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా కొనసాగుతున్న సమయంలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరో చేయడం అసాధ్యమని చెప్పాలి.

దర్శకులు స్టార్ హీరోతో సినిమా అంటే కాస్త జాగ్రత్తగానే ఉండేవారు.

అయితే కె.రాఘవేంద్రరావు ఎన్నో హిట్ సినిమాలు తీశారు.ఇలాంటి సినిమాలలో కొండపల్లి రాజా ఒకటి.వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.స్నేహితుల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమాను చిరంజీవి చేయాల్సిందట.

చివరికి ఏమైంది అంటే.కె విబి సత్యనారాయణ అనే డైరెక్షర్ రజనీకాంత్ నటించిన అన్నమలై సినిమా రైట్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు.

ఈ క్రమంలోనే చిరు ని కలిసిన ఆయన స్టోరీ చెప్పేశాడు.కథ నచ్చడంతో చిరు కూడా ఓకే చెప్పేశాడట.

Telugu Chiranjeevi, Raghavendra Rao, Kondapalli Raja, Krishnam Raju, Venkatesh,

ఇక ఆ తర్వాత సుందరకాండ సెట్స్ లో బిజీగా ఉన్న వెంకటేష్ దగ్గరికి వచ్చిన కె.వి.బి.సత్యనారాయణ అన్నమలై కథ గురించి వివరించాడట.ఇది మనమే చేద్దామని వెంకటేష్ చెప్పాడట దీంతో ఇద్దరు హీరోలలో ఎవరిని వదులుకోవాలో ఆయనకు అర్థం కాలేదట ఇక మొత్తానికి ధైర్యం తెచ్చుకొని చిరుతో ఈ విషయం చెప్పాడట.

Telugu Chiranjeevi, Raghavendra Rao, Kondapalli Raja, Krishnam Raju, Venkatesh,

ఇక చిరంజీవి కూడా వెంకటేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.ఇలా ఈ సినిమా తెరకెక్కింది.సినిమాపై ఒక కేసు కూడా నమోదైంది.1987లో అనే నవల ఆధారంగా హిందీలో ఓ సినిమా తీశారు.దానిని ప్రాణ స్నేహితులు టైటిల్తో తెలుగులో రీమేక్ చేశారు కృష్ణంరాజు.

ఈ సినిమా కథని కొండపల్లి రాజా పేరుతో తీశారు అంటు కృష్ణంరాజు చిత్ర యూనిట్ పై కేసు వేయడం సంచలనంగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube