ఎన్టీయార్ శత దినోత్సవ వేడుక కు చిరంజీవి కి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదంటే..?

ఇవాళ్ళ జరిగే ఎన్టీయార్ శత దినోత్సవ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు పలువురు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు ఈ ఈవెంట్ కు సంబంధించి ఆహ్వానం అందింది.అయితే చిరంజీవి, మోహన్ బాబులకు మాత్రం ఈ వేడుకకు ఆహ్వానం అందకపోవడం సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

 Why Chiranjeevi Not Invited To Ntr Centenary Program Details, Chiranjeevi, Megas-TeluguStop.com

అయితే ఆహ్వానం అందకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.సీనియర్ ఎన్టీఆర్ కు( Sr NTR ) అత్యంత సన్నిహితులలో మోహన్ బాబు( Mohan Babu ) ఒకరనే సంగతి తెలిసిందే…

అయితే మోహన్ బాబు ఎక్కడికి వెళ్లినా ముక్కుసూటిగా మాట్లాడతారు.

 Why Chiranjeevi Not Invited To Ntr Centenary Program Details, Chiranjeevi, Megas-TeluguStop.com

మోహన్ బాబు ప్రస్తుత టీడీపీ ముఖ్య నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఈ రీజన్ వల్లే ఆయనకు ఆహ్వానం అందలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేరు.అయితే చిరంజీవి పలు సందర్భాల్లో జగన్ ను కలవడం జరిగింది…

వైసీపీ సైతం చిరంజీవికి ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.ఈ రీజన్స్ వల్లే చిరంజీవికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.అయితే పార్టీలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సినీ ప్రముఖులు అందరినీ ఆహ్వానించి ఉంటే బాగుండేదని చెప్పవచ్చు.మరోవైపు ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది…

ఇక జూనియర్ ఎన్టీయార్ పుట్టిన రోజు కావడం తో నిన్న నైట్ ఆయన కొరటాల శివ దర్శకత్వం లో చేస్తున్న ntr 30 కి సంభందించిన ఫస్ట్ లుక్ వదిలారు దాంతో పాటు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు సినిమా టైటిల్ దేవర…ఇక ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీయార్ చాలా కొత్తగా ఉన్నాడు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube