నాగ బాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి ఎందుకు చేసాడు..?

Why Chiranjeevi Acted In Gang Leader Movie

గ్యాంగ్ లీడర్ సినిమా చిరు మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన సినిమా.తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాగ్యాంగ్ లీడర్.

 Why Chiranjeevi Acted In Gang Leader Movie-TeluguStop.com

చిరు రఫ్ లుక్, రఫ్ఫాడిస్తా అనే డైలాగులు, చిరు డాన్సులు, ఫైట్లు ఇవన్నీ గ్యాంగ్ లీడర్ హిట్ కి దోహదపడ్డాయి.అయితే మొదట ఈ సినిమా చిరుకి నచ్చలేదని మీకు తెలుసా? అయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే.మ్యాగజైన్ ఎడిటర్ గా పేరు సంపాదించుకున్న విజయ బాపినీడు, సినిమాల మీద ఆసక్తితో “డబ్బు డబ్బు డబ్బు” అనే సినిమాతో దర్శకుడిగా మారారు.ఆ తర్వాత చిరు హీరోగా పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నంబర్ 786 వంటి సినిమాలు చేశారు.

అయితే ఖైదీ నంబర్ 786 మూవీ చిత్రీకరణ సమయంలో మరో మూవీ చేస్తానని, స్క్రిప్ట్ రెడీ చేసుకోమని విజయ బాపినీడుకి చిరంజీవి మాట ఇచ్చారట.చిరంజీవి కోసం విభిన్నమైన కథ రెడీ చేయాలని బాపినీడు అనుకున్నారట.

 Why Chiranjeevi Acted In Gang Leader Movie-నాగ బాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి ఎందుకు చేసాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకా సమయం తీసుకుని మంచి సబ్జెక్ట్ రాసుకుని వెళ్దాం అనుకున్న బాపినీడుకు, చిరంజీవి నుంచి కబురు వచ్చిందట.కథ చెప్పమని అడిగారట చిరు.అయితే అప్పటికి ఇంకా చిరంజీవి కోసం కథ సిద్ధంగా లేదు, మరోపక్క సమయం కూడా లేదు.దీంతో నాగబాబు కోసం రాసుకున్న గ్యాంగ్ లీడర్ కథను చిరుకి వినిపించారట.

అయితే ఆ కథ రొటీన్ గా ఉందని, ఇలాంటి కథలు చాలానే వచ్చాయని చిరు నో చెప్పారట.దీంతో బాపినీడుకి ఏం చేయాలో అర్ధం కాలేదట.సరిగ్గా అదే సమయంలో ఆయనకి పరుచూరి బ్రదర్స్ తో పరిచయం ఏర్పడిందట.ఒకరోజు ఓ హోటల్ లో పరుచూరి బ్రదర్స్ ను కలిసిన బాపినీడు, చిరుతో సినిమా చేస్తున్నాని చెప్పారట.

దానికి పరుచూరి బ్రదర్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారట.కానీ అదే రోజు మళ్ళీ పరుచూరి బ్రదర్స్ ని మీట్ అయిన బాపినీడు, ‘చిరుకి కథ చెప్తే నో చెప్పారని’ దిగులుగా చెప్పడంతో ఆ కథ మాకు వినిపించమని అడిగారట బ్రదర్స్ ఇద్దరూ.

దీంతో బాపినీడు, వారికి గ్యాంగ్ లీడర్ కథ వినిపించారట.మాకు మూడు రోజులు టైమ్ ఇవ్వండి, ఈ కథకి చిరంజీవికి నచ్చేలా ఏం చేయాలో అది చేస్తాం అని పరుచూరి బ్రదర్స్ చెప్పడంతో బాపినీడు ఓకే చెప్పారట.

సరిగ్గా నాలుగో రోజున పరుచూరి బ్రదర్స్ చిరుకి కాల్ చేసి, మీకు బాపినీడు కథ చెప్పారంట కథ, ఈసారి ఆ కథను మేము మీకు చెప్తాం వింటారా అని రిక్వస్ట్ చేశారట.ఇది వరకు విన్న కథే కదా, మళ్ళీ ఏం వింటాను అని వద్దన్నారట చిరు.

లేదు మీరు వినాల్సిందే అని పట్టుబట్టడంతో చిరు ఓకే అన్నారట.రెండు రోజుల తర్వాత చిరుతో సిట్టింగ్ వేశారు బ్రదర్ ఇద్దరూ.

కథలోని సన్నివేశాలను కాస్త అటూ, ఇటూ మార్చి కొత్తగా చెప్పారు.విజయశాంతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరుచూరి బ్రదర్స్ క్రియేట్ చేశారు.

అలానే కథలో హీరో అన్న మురళీమోహన్ తో పాటు హీరో ఫ్రెండ్స్ కూడా చనిపోతారని బాపినీడు రాసుకుంటే, దాన్ని మార్చేశారు.గ్యాంగ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ అన్న టైటిల్ కి జస్టిఫికేషన్ ఉండదని పరుచూరి బ్రదర్స్ ఆ సీన్ ని మార్చేశారు.

ఈ సిట్టింగ్ లోనే “చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ఫాడించేస్తాను” అనే మేనరిజం పుట్టింది.ఇక చిరు జైలుకి వెళ్ళడం, కైకాల సత్యనారాయణ జైలర్ పాత్ర, పోలీస్ పాత్ర వేసిన దేవదాస్ కనకాల చొక్కా కాలర్ హీరో పట్టుకునే సీన్ ఇవన్నీ చిరుకి బాగా నచ్చేశాయి.

దీంతో పక్కన పెట్టేసిన బాపినీడు స్క్రిప్ట్ ని చిరు పట్టాలెక్కించారు.

అప్పటి నుంచి రిజెక్ట్ అయిన కథలని పరుచూరి బ్రదర్స్ రిపేర్ చేసి హిట్ చేయగలరు అన్న పేరు తెచ్చుకున్నారు.ఇక ఈ కథ ఓ కొలిక్కి రావడానికి ఎం.వివి.ఎస్ బాబూరావు సహకరించగా, పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాశారు.స్క్రిప్ట్ అంతా సిద్ధం అయ్యాక డబ్బింగ్ ఆర్టిస్టులతో రికార్డ్ చేసి క్యాసెట్లు తయారుచేశారు.చిరు నటించిన స్టేట్ రౌడీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన బప్పిలహరిని బాలీవుడ్ నుంచి పిలిపించారు.ఆయన ఒకే ఒక్క రోజులో మొత్తం ట్యూన్స్ ఇవ్వడం విశేషం.

సినిమాలో ఆరు పాటల్లో ఒకటి వేటూరి, 5 పాటలు భువనచంద్ర రాశారు.ఈ 5 పాటలను హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కి ఉదయం విజయవాడలో దిగేలోపు పూర్తి చేశారు.

అయితే ఈ మూవీలో చిరు పక్కన జోడీగా భానుప్రియని అనుకున్నారు.కానీ ఆ తర్వాత విజయశాంతిని తీసుకున్నారు.చిరు అన్నయ్య పాత్రకు మొదట కృష్ణంరాజును అనుకున్నారు, కానీ ఆ తర్వాత మురళీమోహన్ ను తీసుకున్నారు.ఇలా రావుగోపాలరావు, ఆనంద్ రాజ్, దేవదాస్ కనకాల, కైకాల సత్యనారాయణ, సుమలత, నిర్మలమ్మ వంటి పాత్రలను తీసుకుని మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేశారు.

కానీ నిడివి ఎక్కువైందని చిరు అనడంతో బాపినీడు ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని ఎడిటర్ త్రినాథ్ తో కలిసి 2 వేల అడుగులు తొలగించారు.ఆ తర్వాత చిరుకి చూపించి డబ్బింగ్ చెప్పించారు.

ఇక బప్పిలహరి పాటలకు ట్యూన్స్ మాత్రమే ఇచ్చారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సాలూరి వాసూరావు అందించారు.ఆ తర్వాత సినిమా మే 9 న 1991 లో రిలీజైంది.

ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.చిరంజీవి బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేశారు.

అలా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేవరకూ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ పడ్డారు దర్శకుడు బాపినీడు.చివరకి చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి చిరుని మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.

#Chiranjeevi #Naga Babu #Gang #Nirmalamma #Veturi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube