బాబు ఆ ఒక్క‌ మంత్రినే ఎందుకు టార్గెట్ చేస్తున్న‌ట్టు..!  

why chandrababu targeting that minister only, chittoor, pedireddy, tdp, ysrcp, targeting, chandra babu naidu, contracts, tenders, minister - Telugu Chandra Babu Naidu, Chittoor, Contracts, Minister, Pedireddy, Targeting, Tdp, Tenders, Ysrcp

చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా.పేరుకు బాబు సొంత జిల్లా గానీ ఇక్కడ ఆధిక్యం మాత్రం వైసీపీదే.

 Why Chandrababu Targeting That Minister Only

అసలు వైసీపీది అనడం కంటే, చిత్తూరు రాజకీయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసిస్తున్నారని చెప్పొచ్చు.ఇక్కడ ప్రతి నియోజకవర్గంపై పెద్దిరెడ్డికి పట్టుంది.

అలాగే ఇక్కడ వైసీపీ మంచి విజయాలు నమోదు కావడానికి పెద్దిరెడ్డి కష్టం చాలానే ఉంది.సొంత జిల్లాలోనే బాబుని దెబ్బకొట్టాలనే దిశగా పెద్దిరెడ్డి నిత్యం పనిచేస్తుంటారు.

బాబు ఆ ఒక్క‌ మంత్రినే ఎందుకు టార్గెట్ చేస్తున్న‌ట్టు..-Political-Telugu Tollywood Photo Image

పెద్దిరెడ్డి కష్టం ఫలితం 2019 ఎన్నికల్లో స్పష్టంగానే కనిపించింది. జగన్ ఇమేజ్‌కు, పెద్దిరెడ్డి కష్టం తోడవ్వడంతో చిత్తూరులో వైసీపీ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.కేవలం కుప్పం మినహా మిగతా స్థానాలన్ని వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.పైగా వైసీపీ అధికారంలోకి రావడం పెద్దిరెడ్డి మంత్రి కావడంతో, జిల్లాలో టీడీపీకి పెద్ద స్థానం లేకుండాపోయింది.

దీంతో సొంత జిల్లాలోనే పార్టీ దెబ్బతింటుందని భావించి బాబు, పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.సాధారణంగా బాబు, వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటారు గానీ, స్పెషల్‌గా ఏ మంత్రిని పేరు పెట్టి విమర్శలు చేయరు.

కానీ పెద్దిరెడ్డి విషయంలో అలా కాదు.ఆయన పేరు పెట్టి మరీ విమర్శలు చేస్తుంటారు.స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సమయంలోనే పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని బాబు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.అలాగే ఎప్పటికప్పుడు అక్రమ మైనింగ్‌కు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

తాజాగా కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ సొంత మద్యం బ్రాండ్లు పెట్టుకుని నచ్చినట్లు రేట్లు పెంచి.వేల కోట్లు దోచుకుంటున్నారని, ఇసుకలో దోపిడి, ఇళ్లస్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

గనులు, కాంట్రాక్టులు, టెండర్లు, ఇలా ప్రతి పనీలోనూ కమిషన్లు వసూలు చేస్తున్నారని, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆగడాలు ఎక్కువైపోయాయని, వారి తోకలు కత్తిరిస్తామని బాబు పెద్ద వార్నింగ్ ఇచ్చారు.మొత్తానికైతే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి బాబు ఈ విధంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

మరి చూడాలి బాబు పెద్దిరెడ్డికి ఏ మేర చెక్ పెట్టగలుగుతారో.?

.

#Targeting #Tenders #Ysrcp #Chittoor #Contracts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Why Chandrababu Targeting That Minister Only Related Telugu News,Photos/Pics,Images..