“ఐవైఆర్” పై చంద్రబాబు “వెనుకడుగు” ఇందుకేనా   Why Chandrababu Not Taking Action On IYR Krishna Rao.?     2018-04-02   01:37:32  IST  Bhanu C

ఏపీ ప్రభుత్వం పై..సీఎం చంద్రబాబు పై ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ సిఎంఒ అధికారులపై చీటికి మాటికి అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం యొక్క పరువుని తీయడమే పరమావధిగా పెట్టుకున్న ఐవిఆర్ కృష్ణారావు..తాజాగా ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.. ‘ఎవరి రాజధాని అమరావతి’ అనే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు..దీంట్లో ఉన్న కధనాలు ప్రభుత్వాన్ని దేబ్బకోట్టేవిలా ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయినా సరే ఐవిఆర్ పై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?

సిఎంఒ కార్యాలయంపై నిత్యం ఆరోపణలు చేస్తూ…హైకోర్టుకెక్కిన “ఐవిఆర్” చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. రాజధాని నిర్మాణాలపై…రైతులు ఇచ్చిన భూములపై చంద్రబాబు రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కూడా విమర్శించారు..అయినా సరే “ఐవిఆర్” పై చర్యలు ఎందుకు లేవు..సరి కదా ఆయన విమర్శలకు సమాధానం ఇవ్వడం లేదు. దీంతో..ఆయన రోజు రోజుకీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు..

-

అసలు “ఐవిఆర్” పై ఎందుకు చంద్రబాబు ఇంత వెనకడుగు వేస్తున్నారు..సీఎస్ గా ఆయన్ని నియమించక ముందు ఆయన దినకొండలో భూములు కొనుగోలు చేశారు..అన్ని భూముల కొనుగోలుకు డబ్బు ఎక్కడినుంచీ వచ్చింది..? ఆయన వెనుక ఉన్న బినామీలు ఎవరు..? దీనిపై ముందు విచారణ చేయిస్తే..ఐవైఆర్‌ జాతకం బయటకు వస్తుంది…అయితే ఇదే కనుకా చేస్తే “ఐవిఆర్” పై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తాయనే కారణంతోనే ఆయనపై విచారణకు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి..

ఎందుకంటే బ్రాహ్మణా కార్పోరేషన్ చైర్మెన్ గా “ఐవిఆర్” ఏపీలో బ్రాహ్మణులకి ఎంతగానో దెగ్గర అయ్యారు..అసలు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం చంద్రబాబు కనుసన్నల్లో ఉండే కార్పోరేషన్ ని “ఐవిఆర్” పై నమ్మకంతో పూర్తి భాద్యతలు అప్పగిస్తే అన్నీ తానై నడిపారు..బ్రహ్మణులు సైతం దానికి కర్త కర్మా క్రియ “ఐవిఆర్” అని భావించారు దాంతో బ్రాహ్మణుల తరుపు గొంతుగా మారారు “ఐవిఆర్”..ఆ తరువాత ఆయన్ని పదవి నుంచీ తోలిగించినపుడు. .బ్రాహ్మణులూ ఎంతో ఆగ్రహానికి లోనయ్యారు..అయితే ఈ పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకుంటే ఇప్పటివరకూ ఏపీలో బ్రాహ్మణులు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఎక్కడ కోల్పోతామో అని భయంతో వెనకడుగు వేశారు..

ఒక వేళ చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనుకున్నా సరే తన వర్గం వారిని ప్రభుత్వానికి ఎలా వ్యతిరేకం చేయాలో “ఐవిఆర్” కి బాగా తెలుసు దాంతో “ఐవిఆర్” ఎన్ని మాటలు మాట్లాడినా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటోందని అంటున్నారు విశ్లేషకులు..కానీ ‘ఐవైఆర్‌’ను కంట్రోల్‌ చేయలేకపోయినా సరే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ప్రభుత్వం “ఐవిఆర్” విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..