బ్రహ్మానందం ఎందుకు మాయం అయ్యారు?

టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గతకొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన కామెడీతో నవ్విస్తూ వస్తున్నాడు.ఈ కాలంలో బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.

 Why Brahmanandam Disappeared From Movies, Brahmanandam, Telugu Movies, Comedian,-TeluguStop.com

ప్రతి హీరో సినిమాలోనూ బ్రహ్మి కనబడాల్సిందే.కానీ కాలం మారుతూ రావడంతో బ్రహ్మానందం క్రేజ్ కూడా తగ్గింది.

దీంతో ప్రస్తుత జనరేషన్ ఆడియెన్స్ సరికొత్త కమెడియన్స్ ఉన్న సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే బ్రహ్మి ప్రస్తుతం చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారనే చెప్పాలి.

నిజానికి ఆయన కామెడీ లెంగ్త్ పాత్రలో నటించిన దాఖలాలు ఇటీవల కాలంలో లేవనే చెప్పాలి.బ్రహ్మానందం చాలా ఏళ్లుగా తెరపై మెరుస్తుండటంతో ఒకేరకమైన కామెడీని చూస్తున్నామని ఫీల్ అవుతున్న ప్రేక్షకులు, ఆయన కామెడీని పెద్దగా పట్టించుకోవడం లేదు.

దీనికి తోడు జబర్దస్త్ లాంటి షోల్లో ఉన్న కొత్త కమెడియన్స్ తమ కామెడీతో నేటి ఆడియెన్స్‌ను మెప్పిస్తుండటం, కొత్త దర్శకులు కథకే ప్రాధాన్యత ఇస్తుండటం, స్టార్ నటులను పట్టించుకోకపోవడంతో బ్రహ్మికి అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.

ఒకప్పుడు రోజులు రూ.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న బ్రహ్మానందం, ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించినా అవకాశాలు మాత్రం రావడం లేదు.దీంతో స్టార్ హీరోలు మొదలుకొని కొత్త చిత్రాల దర్శకుల వరకు బ్రహ్మిని అవాయిడ్ చేస్తున్నారు.

బలవంతంగా బ్రహ్మానందం కోసం పాత్రలను క్రియేట్ చేయడం వీలు కాదని వారు అంటున్నారు.మొత్తానికి తన కామెడీతో గిన్నిస్ రికార్డును కూడా సాధించిన బ్రహ్మానందం ప్రస్తుతం అవకాశాల లేక ఉన్నాడనేది చేదు నిజం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube