గుడిలో తల మీద షడగోప్యం (శఠగోపం) ఎందుకు పెట్టించుకోవాలి?

దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తీర్ధం తీసుకోవటం మరియు షడగోప్యం పెట్టించుకోవటం తప్పనిసరిగా చేయాలి.కానీ చాలా మంది దేవుని దర్శనం అయ్యాక షడగోప్యం (శఠగోపం) పెట్టించుకోకుండా హడావిడిగా వెళ్లి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుంటారు.

 Why Blessing With Shatagopam On The Head In Temple-TeluguStop.com

అయితే చాలా మందికి శఠగోపం ఎందుకు పెట్టించుకోవాలో తెలియదు.శఠగోపం పెట్టించుకోవటంలో ఒక అర్ధం ఉంది.శఠగోపం పెట్టించుకొనే సమయంలో మన కోరికను పూజారికి కూడా విన్పించకుండా తలచుకోవాలి.మనిషికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యములకు దూరంగా ఉంటామని తలచుకుంటూ శఠగోపం పెట్టించుకోవాలి.

కానీ చాలా మంది చిల్లర లేదనే కారణంతో శఠగోపం పెట్టించుకోవటం మానేస్తు ఉంటారు.అలా మానేయటం చాలా తప్పు.తప్పనిసరిగా శఠగోపం పెట్టించుకోవాలి.రాగి, కంచు, వెండిలతో తయారుచేసిన షడగోప్యంపై విష్ణు పాదాలు ఉంటాయి.

అంతేకాక షడగోప్యం తల మీద పెట్టినప్పుడు అందులో ఉండే లోహం మన శరీరంలో అధికంగా ఉన్న విధ్యుత్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది.దాంతో ఆందోళన,ఆవేశం తగ్గుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube