తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారో తెలుసా?  

Why Betel Leaf Is Used For Tamboolam.?-

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసే సమయంలతమలపాకుని ఉపయోగిస్తారు. పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకునతప్పనిసరిగా ఉపయోగిస్తారు..

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారో తెలుసా?-

పసుపు గణపతినీ,గౌరీదేవినీ తమలపాకుపైనఅధిష్టింపజేస్తాం. భారత దేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటుభగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరతమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

స్కాంద పురాణం ప్రకారం క్షీర సాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైవస్తువులలో తమలపాకు ఒకటి. కొన్ని జానపద కధల ప్రకారం శివపార్వతులే స్వయంగతమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని ప్రతీతి. తమలపాకు యొక్క మొదటి భాగంలకీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని మపెద్దలు చెబుతాతమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

తమలపాకు మధ్యభాగంలో సరస్వతీదేవి ఉంటుంది.

తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన జ్యేష్టా దేవి ఉంటుంది.

తమలపాకులో విష్ణుమూర్తి ఉంటాడు.

తమలపాకు పైభాగంలో శివుడు, కామదేవుడు ఉంటారు..

తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

తమలపాకుకి కుడి భాగంలో భూమాత ఉంటుంది.

సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారు.