తులసి మొక్క క్రితం జన్మలో వినాయకుడు ప్రేమించిన యువతి అంట.! ఆమెకు పెట్టిన శాపం ఏంటంటే.?  

Why Avoid Tulasi Leaf In Ganesh Puja-

The story of the basil plant has been in the propaganda one since ancient times. The Vigneswarar once sits on the banks of the Ganges and makes a penance. At the same time, a woman named Thulasi comes here to see the Ganesh. She immediately goes to Ganesh and asks her to marry him. But Ganesan refuses to do that. If married, he says that he will break his tapas. Thulasi angrily gets angry with Ganesha. Thulasi claims that his marriage will be forced and unwilling. In this order, the angry Ganesha tries to curse Thulasi. He is married to a monster and that he will have to face all the difficulties that he brings to the curse.

.

However, Tulsi immediately prays to Ganesu to find out her fault. Ganesha then says that the curse can not be redeemed, but in the next birth, the birth of a tulsi tree without Vishnu is not to be worshiped, and it will have many medicinal properties. Later, Tulsi marries a demon named Shankoda. She will suffer for a few days and die. Once again the basil is born in the form of plant. Since then, Tulsi plant foliage is used for Vishnu Puja. It is also said that the Vishnu Puja is not complete without the basal leaves. And now we all know about medicinal properties in the basil plant. But the holy Thulasi is not used in Vinayakudi Pooja. Because scholars claim that this is the cause of the incident between them. .

పురాత‌న కాలం నుంచి తుల‌సి మొక్కకు సంబంధించిన క‌థ ఒకటి ప్ర‌చారంలో ఉంది. అదేమిటంటే, విఘ్నేశ్వ‌రుడు ఒక‌సారి గంగాన‌ది ఒడ్డున కూర్చుని త‌ప‌స్సు చేస్తుంటాడు. అదే స‌మ‌యంలో తుల‌సి అనే ఓ మ‌హిళ అక్క‌డికి వ‌చ్చి గ‌ణేషున్ని చూసి ముగ్దురాల‌వుతుంది..

తులసి మొక్క క్రితం జన్మలో వినాయకుడు ప్రేమించిన యువతి అంట.! ఆమెకు పెట్టిన శాపం ఏంటంటే.?-Why Avoid Tulasi Leaf In Ganesh Puja

వెంట‌నే గ‌ణేషుని వ‌ద్ద‌కు వెళ్లి త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని అడుగుతుంది. అయితే అందుకు వినాయ‌కుడు నిరాక‌రిస్తాడు. వివాహం చేసుకుంటే త‌న త‌పస్సుకు భంగం క‌లుగుతుంద‌ని అంటాడు.

దీంతో తుల‌సికి కోపం వ‌చ్చి వినాయ‌కుడికి శాపం పెడుతుంది. అత‌ని వివాహం బ‌ల‌వంతంగా, ఇష్టం లేకుండా జ‌రుగుతుంద‌ని తుల‌సి అంటుంది. ఈ క్ర‌మంలో ఆగ్ర‌హానికి లోనైన వినాయ‌కుడు తుల‌సికి శాపం పెడ‌తాడు.

ఒక రాక్ష‌సుడితో ఆమె వివాహం జ‌రుగుతుంద‌ని, అత‌ని వ‌ల్ల అన్నీ క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, వినాయ‌కుడు తుల‌సికి శాపం పెడ‌తాడు.

అయితే వెంట‌నే తుల‌సి త‌న త‌ప్పు తెలుసుకుని శాప విమోచ‌నం చేయ‌మ‌ని గ‌ణేషున్ని ప్రార్థిస్తుంది. కాగా గ‌ణేషుడు అప్పుడు ఏమంటాడంటే, శాపం విమోచ‌నం చేయ‌లేన‌ని, కానీ వ‌చ్చే జ‌న్మ‌లో తుల‌సి మొక్క‌గా జ‌న్మిస్తావ‌ని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జ‌ర‌గ‌ద‌ని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔష‌ధ గుణాలు కూడా క‌లిగి ఉంటాయ‌ని వినాయ‌కుడు తుల‌సికి వ‌రం ఇస్తాడు. అనంత‌రం తుల‌సి శంక‌చూద అనే ఓ రాక్ష‌సున్ని వివాహం చేసుకుంటుంది.

కొద్ది రోజుల పాటు క‌ష్టాల‌ను అనుభ‌వించి ఆమె మ‌ర‌ణిస్తుంది. మ‌ళ్లీ తుల‌సి మొక్క రూపంలో జ‌న్మిస్తుంది. అప్ప‌టి నుంచి తుల‌సి మొక్క ఆకుల‌ను విష్ణు పూజ‌కు ఉప‌యోగిస్తున్నారు..

ఇప్పుడు కూడా తుల‌సి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాద‌ని చెబుతారు. అంతేకాదు తుల‌సి మొక్క‌లో ఉన్న ఔష‌ధ గుణాల గురించి కూడా ఇప్పుడు మ‌నంద‌రికీ తెలుసు. కాగా అంత‌టి ప‌విత్ర‌మైన తుల‌సిని వినాయ‌కుడి పూజ‌లో మాత్రం వాడ‌రు.

ఎందుకంటే వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే అందుకు కార‌ణ‌మ‌ని పండితులు చెబుతారు.

హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి అంద‌రికీ తెలుసు. మ‌హిళ‌లు నిత్యం తుల‌సి మొక్క చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. చ‌నిపోతున్న వారి నోట్లో తుల‌సి తీర్థం పోసినా, తుల‌సి ఆకుల‌ను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుంద‌ట‌.

దీనికి తోడు తుల‌సి మొక్క వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే ఉన్నాయి. తుల‌సి ఆకుల‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ వాడుతారు. అయితే మీకు తెలుసా..

? తుల‌సి మొక్క హిందూ సాంప్ర‌దాయంలో అత్యంత పవిత్ర‌మైన మొక్క‌గా ఎందుకు మారిందో.? ఎందుకు ఆ మొక్క‌కు అన్ని ఔష‌ధ గుణాలు ఉన్నాయో.? అదే తెలుసుకుందాం రండి.