జనసేన వైపే వారందరి చూపు .. ఎందుకిలా ?

ఏపీలో జనసేన పార్టీ(Janasena) ప్రభావం రోజుకు పెరుగుతోంది.ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి(TDP Janasena, BJP)) కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేయడం, అధికారంలోకి రావడం జరిగిపోయాయి.

 Why Are They All Looking Towards Janasena?, Janasena, Ysrcp, Telugudesam, Jagan,-TeluguStop.com

ప్రభుత్వంలోనూ జనసేన కీలక భాగస్వామిగా వ్యవహరిస్తూ వస్తోంది.  ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ,  తన మార్క్ కనిపించేలా చూస్తున్నారు .ఇక వైసిపి(YCP)) మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో,  ఆ పార్టీలోని నాయకులు , కార్యకర్తలు పూర్తిగా డీలా పడ్డారు.ఇక గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారు,  జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు .అయితే ఇలా వైసిపికి దూరమవుతున్న వారంతా జనసేన వైపు చూస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

Telugu Alla Nani, Chandrababu, Jagan, Janasena, Kilari Rosaiah, Lokesh, Pawan Ka

164 సీట్లతో ఏపీలో కూటమి బలంగా ఉంది.దీంతో ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక దాంట్లోకి వెళ్తే మంచిదని వైసీపీలో కీలక పదవుల్లో పనిచేసిన వారు భావిస్తున్నారు.టిడిపిలో చేరాలా , జనసేన చేరాలా అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనసేన వైపే మొగ్గు చూపిస్తున్నారు.

దీనికి కారణం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది.మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి అన్నిచోట్ల విజయం సాధించింది.క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి క్యాడర్ పెద్దగా లేకపోయినా, పవన్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే భవిష్యత్తులో జనసేన మరింత కీలకం కాబోతుందనే విషయం వారికి అర్థమైంది.అందుకే వైసిపిని(Ycp) వీడి కూటమిలో చేరాలనుకునేవారు టిడిపి కంటే జనసేన బెటర్ అన్న ఆలోచనతో ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారట.

  తాజాగా జనసేన లో చేరిన కైకలూరు నేత జయ మంగళ వెంకటరమణ,  మంగళగిరి నేత గంజి చిరంజీవి(Mangala Venkataramana, Mangalagiri Neta Ganji Chiranjeevi) లు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు .సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీలకు టిడిపిలో ప్రాధాన్యం ఉంటుంది.దీంతో వారు ఆ పార్టీలోకి వెళ్లాలి. 

Telugu Alla Nani, Chandrababu, Jagan, Janasena, Kilari Rosaiah, Lokesh, Pawan Ka

కానీ అలా కాకుండా జనసేనలో చేరారు.గతంలో విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది ముందుగా టిడిపిలోకి(TDP) వెళ్లినా,  ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.  ఇటీవల వైసిపి పదవులకు , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(Alla Nani) సైతం జనసేనలో చేరే ఆలోచనతో ఉన్నారట.

ఇక అంతకుముందు జనసేన లో చేరిన సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్య (Balineni Srinivasa Reddy, Kilari Rosaiah)వంటి వారు టిడిపిలో చేరాల్సి ఉన్నా,  వారు జనసేనని ఆప్షన్ గా ఎంచుకున్నారు గతంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ సైతం జనసేన లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Alla Nani, Chandrababu, Jagan, Janasena, Kilari Rosaiah, Lokesh, Pawan Ka

ఈ విధంగా జనసేన చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.  టిడిపిలో చేరుడమనుకున్నా,  తమ రాజకీయ ప్రత్యర్థులు ఆ పార్టీలో ఉండడం,  ప్రస్తుతం టిడిపి నారా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది.దీంతో భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా, టిడిపి కంటే పవన్ ఆధ్వర్యంలోని జనసేన బెటర్ అన్న ఆలోచనతో పాటు,  పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న రాజకీయ వైఖరి దృష్ట్యా ఆ పార్టీలో చేరితేనే మంచిదనే ఆలోచనతో వీరంతా జనసేనని ఆప్షన్ గా ఎంచుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube