ఏపీకి స్టార్టప్ కంపెనీలు ఎందుకు రావడం లేదు?

రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఏపీలో అవకాశాలు సమృద్ధిగా ఉండటంతో స్టార్టప్ కంపెనీలు చాలా వస్తాయని అందరూ భావించారు.చంద్రబాబు హయాంలో చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి.

 Why Are Startup Companies Not Coming To Ap Details,  Andhra Pradesh, Start  Ups,-TeluguStop.com

కానీ రాజధాని నిర్మాణం పూర్తయ్యాక కార్యాలయాలను స్థాపించాలని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి.అయితే ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో కంపెనీలు యూటర్న్ తీసుకున్నాయి.

చాలా కంపెనీలు ఏపీలో కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లను ఎంచుకున్నాయి.

తాజాగా కేంద్రం ప్రకటించిన స్టార్టప్ ర్యాంకింగ్స్‌ల జాబితాలో ఏపీ వెనుకబడి ఉందని స్పష్టమైంది.

డిపార్టుమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా స్టార్టప్స్ ఏర్పాటు ప్రోత్సాహం విషయంలో ర్యాంకింగ్స్ విడుదల చేసింది.తెలంగాణ టాప్‌ ప్లేస్‌లో ఉంటే ఏపీ మాత్రం ర్యాంకుల్లో చివరి కేటగిరి అయిన ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌లో ఉంది.

 తెలంగాణా సూపర్ స్టార్ రేటింగ్ దక్కించుకోగా.గుజరాత్, కర్ణాటక మెగాస్టార్ హోదా దక్కించుకున్నాయి.ఏపీ మాత్రం సన్ రైజర్స్ క్యాటగిరిలో ఎక్కడో పాతాళంలో ఉంది.ఈ క్యాటగిరిలో ఏపీతో పాటు బీహార్, మిజోరం, లడ్డఖ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలు చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ మంచి స్టార్టప్స్ ఎందుకు రావటంలేదో అర్ధం కావటం లేదని డీపీఐఐటీ ఆశ్చర్యపోయింది.

Telugu Andhra Pradesh, Ap Startup, Chandrababu, Cmjagan, Pattabhi, Start Ups, Te

స్టార్టప్స్ డెవలప్మెంట్ విషయంలో ఏపీలో సరైన ప్రోత్సాహం లేని కారణంగానే ప్రతిభ కలిగిన విద్యార్ధులంతా హైదరాబాద్ బెంగుళూరు లాంటి రాష్ట్రాలకు వెళిపోతున్నట్లు గుర్తించింది.ఇటీవల కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిగ్రూప్‌లో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌.స్టార్టప్‌లలో మాత్రం మాత్రం వెనకబడింది.

ఈ ర్యాంకుతో ఏపీకి కాస్త ఇబ్బంది కలిగే అంశమని చెప్పాలి.

అయితే ఏపీ ర్యాంకుపై టీడీపీ పెదవి విరిచింది.

Telugu Andhra Pradesh, Ap Startup, Chandrababu, Cmjagan, Pattabhi, Start Ups, Te

దేశంలోనే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం కంటే ముందే 2014లో ఏపీలో చంద్రబాబు స్టార్టప్‌ పాలసీ తెచ్చారని ఆ పార్టీ నేత పట్టాభి తెలియజేశారు.రాష్ట్ర పనితీరును చూసిన కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లకు ఏపీని మెంటార్‌గా నియమించిందన్నారు.ఏపీలో 259 స్టార్టప్‌లు పనిచేస్తున్నట్టు 2018-19లో విడుదలైన స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌ నివేదికలో స్పష్టంగా ఉందని.ఆ నివేదిక ప్రకారం ఏపీ లీడర్‌ స్థానాన్ని కైవసం చేసుకుందని వివరించారు.2021 స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌లో ఏడు ఏరియాల్లో 26 యాక్షన్‌ పాయింట్లు ఉండగా కేవలం 7 పాయింట్లనే ఏపీ అడ్రస్‌ చేసిందంటే అంతకంటే అవమానం ఏముందని పట్టాభి ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube