ఫ్లెమింగోలు పుట్టినప్పుడు గ్రే కలర్, పెరిగాక పింక్ కలర్‌లోకి ఎందుకు మారుతాయో తెలుసా?

సాధారణంగా ఫ్లెమింగో(రాజహంస)లు గులాబీ రంగులో కనిపిస్తాయి.అవి పుట్టినప్పుడు బూడిద రంగులో ఉంటాయి.

 Why Are Flamingos Pink Know The Science Details, Colour Bird Water Eating Food,-TeluguStop.com

వాటి రంగు ఇలా ఎందుకు మారుతుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్లెమింగోల రంగు జన్యుపరమైనదని చాలామంది అనుకుంటారు.అయితే ఇది అస్సలు నిజం కాదు.

సైన్స్ తెలిపిన వివరాల ప్రకారం వాటి శరీర రంగుకు వాటి డీఎన్ఏకి అస్సలు సంబంధం లేదు.ఫ్లెమింగోల సహజ రంగు బూడిద రంగు.

అయితే అవి తినే ఆహారం కారణంగా వాటి రంగు మారుతుంది.ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం వాటి రంగుకు కారణం వాటి ఆహారమే.

అవి దీర్ఘకాలం పాటు చెరువులు లేదా సరస్సులలో జీవిస్తుంటాయి.

అవి సముద్ర జీవుల ఆల్గే, లార్వాలను తింటాయి.

ఫలితంగా ఫ్లెమింగోల రంగు మారిపోతుంది.అయితే ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే.

ఆల్గే, లార్వాలు తినడం వలన వాటి శరీరంలో ఏమి జరుగుతుంది? ఆల్గేతో పాటు సముద్ర జీవుల లార్వాలు ఎరుపు.నారింజ రంగులను కలిగి ఉంటాయి.

వీటిని తినడం వల్ల ఫ్లెమింగోల శరీరంలో ఆ రంగు స్పష్టంగా కనిపిస్తుంది.వాటి శరీరంలోకి చేరిన బీటా కెరోటిన్ పరిమాణాన్ని బట్టి వాటి రంగు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.

Telugu Algae, Beta Carotine, Enzymes, Flamingos, Flamingos Color, Flemingos Colo

బీటా కెరోటిన్ అనేది ఫ్లెమింగోల శరీరంలోకి చేరినప్పుడు, అది ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌ల ద్వారా విచ్ఛిన్నమవుతుంది.ఫలితంగా పిగ్మెంటెడ్ భాగం శరీరంలోని కొవ్వు భాగానికి చేరుతుంది.ఇక్కడి నుంచి చర్మం, రెక్కలపైకి చేరిన ఆ ప్రభావం శరీరంపై కనిపిస్తుంది.అయితే ఫ్లెమింగోలు ఎక్కడికి వెళితే అక్కడి ఆహారాన్ని తింటాయి.అందుకే ఫ్లెమింగోలన్నీ ఒకే రంగును కలిగి ఉండవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube