విమానాలకు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా.? ఎండ గురించి మాత్రమే కాదు.!       2018-07-03   01:44:23  IST  Raghu V

గాలిలో ఎగురుతున్నపుడు లేదా ఎయిర్ ట్రావెల్ చేస్తున్నపుడు మనం చూసే ప్రతి విమానం తెలుపు రంగులోనే ఉంటుంది. పేర్లు, డిజైన్లు మరియు కొన్ని పట్టీలు వివిధ రంగుల్లో ఉన్నపటికీ విమానం ఎక్ట్సీరియర్‌లో ప్రధానమైన రంగు మాత్రం తెలుపే ఉంటుంది. విమానాలు ఎందుకు తెల్లగా ఉంటాయి అనేది మీరు పూర్తిగా ఆశ్చర్య పోయేంత ప్రత్యేకమైనది.ఇది ఖచ్చితంగా మీకు ఆలోచనకు కూడా అందనంత ప్రత్యేకం.

అన్ని రంగుల్లో కన్నా తెలుపు రంగు కాంతిని అత్యుత్తమంగా పరావర్తనం చెందిస్తుంది. సూర్యరశ్మి నుండి దాదాపు అన్ని రకాల కాంతిని తెలుపు రిఫ్లెక్ట్ చేస్తుంది.అంతే కాకుండా తెలుపు రంగు మాత్రమే వేడిని గ్రహించదు. మరే ఇతర రంగులతో విమానానికి పెయింట్ చేస్తే, అది సూర్యుని నుండి వచ్చే ఉష్ణోగ్రతను అధిక మొత్తంలో గ్రహిస్తుంది. తద్వారా విమానం యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది.

అంతేకాకుండా ఇత‌ర రంగుల‌తో పోలిస్తే తెలుపు రంగుకు అయ్యే ఖ‌ర్చు కూడా చాలా త‌క్కువ‌. అంతేకాకుండా తెలుపు రంగు పూసిన విమానాల‌ను నిర్వ‌హించ‌డం చాలా తేలిక‌. అదే ఇత‌ర రంగులైతే త్వ‌ర‌గా వెల‌సిపోతాయి. కాబ‌ట్టి వాటికి ఎప్ప‌టిక‌ప్పుడు రంగులు వేయాల్సి ఉంటుంది.

మరో కారణం ఏమిటంటే..విమానాల‌ను న‌డిపించే కంపెనీలు వాటిని తిరిగి రీసేల్ చేయ‌డం చాలా తేలిక‌వుతుంది. వాటిని కొనుగోలు చేసిన వేరే కంపెనీలు వాటిపై ఉన్న లోగోల‌ను, ఇత‌ర మార్క్‌ల‌ను మాత్ర‌మే తొలగిస్తే చాలు, వెంట‌నే వారు వాటిని త‌మ కంపెనీ కోసం వాడుకోవ‌చ్చు. అదే ఇత‌ర రంగులు ఉంటే వాట‌న్నింటినీ తొల‌గించి వాడుకోవాలంటే కొంత ఖ‌ర్చ‌వుతుంది.