ఏప్రిల్ 28న టాలీవుడ్ హిస్టరీ లో వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది.సినిమా తీసినా, దాన్ని ప్రచారం చేసినా, చివరకు విడుదల చేసినా.

 Why April 28 Is Centiment For Tollywood Rrr Pokiri Yamaleela Rrr Details, Tollyw-TeluguStop.com

తన మార్క్ ప్రత్యేకత చాటుకుంటాడు.ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.రకరకాల కారణాలతో పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది.

ఈ సినిమా గురించి ప్రస్తుతం దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.

అటు సినిమా యూనిట్ కూడా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు.తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి తేదీని ప్రకటించారు.

అయితే గతంలో ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.మార్చి 18న ఈ సినిమా విడుదల చేస్తామని చెప్పారు.

ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఏప్రిల్ 28న జనాల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ప్రకటించిన రిలీజ్ డేట్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.

ఒక సినిమాకు ఇన్ని రిలీజ్ డేట్లు ఉంటాయా? ఈ సినిమాకు ప్రకటించినన్ని రిలీజ్ డేట్లు మరే సినిమాకు ఉండకపోవచ్చు? అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.అటు ఈ సినిమా డేట్స్ ప్రకటన గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Telugu Adavi Ramudu, April, Bahubali, Rajamoulil, Pokiri, Rrr, Sr Ntr, Tollywood

రాజమౌళి ఈ డేట్ ప్రకటించడం వెనుక చాలా ఆలోచన ఉందని చెప్తున్నారు.గతంలో ఈ తేదీన ప్రకటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయని చెప్తున్నారు.ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించాయట.ఇంతకీ గతంలో ఈ తేదీన విడుదల అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందుక ఏప్రిల్ 28న రిలీజ్ అయిన సినిమాలు చూస్తే.సీనియర్ ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు విడుదల అయ్యింది.

ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.అంతేకాదు.

అద్భుతంగా వసూళ్లను రాబట్టింది.అటు అదే రోజున ఆలీ హీరోగా యమలీల అనే సినిమా కూడా విడుదల అయ్యింది.

ఈ సినిమా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకుంది.

Telugu Adavi Ramudu, April, Bahubali, Rajamoulil, Pokiri, Rrr, Sr Ntr, Tollywood

అటు మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకుంది.అటు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 కూడా ఇదే రోజున విడుదల అయ్యింది.ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్ట్రరీలో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

ఇదే రోజు ఈ సినిమాను కూడా విడుదల చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి.అయితే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో ఇప్పుడు తెలుసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube