అనుష్క పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు ఎందుకు?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది ఇక అనుమానమే అన్నట్లుగా మారింది.రెండు మూడు సంవత్సరాల క్రితం ప్రభాస్ పెళ్లి అదిగో… ప్రభాస్ పెళ్లి ఇదిగో అంటూ ఎన్నో వార్తలు, ఎన్నో ప్రచారాలు వచ్చాయి.

 Why Anushka Not Saying Ok To Marriage , Anushka, Baahubali, Film News,prabhas,pr-TeluguStop.com

బాహుబలి సినిమా విడుదల అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ప్రతి ఒక్కరు అన్నారు.కృష్ణంరాజు కూడా అమ్మాయిలని చూస్తున్నాము, త్వరలోనే ఒక అమ్మాయిని ఫిక్స్ చేసి పెళ్లి చేస్తాము అంటూ అధికారికంగా ప్రకటించాడు.

కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కానీ.అసలు పెళ్లి ఊసే లేకుండా పోయింది.

దాంతో ప్రభాస్ అభిమానులు పెళ్లి ఉందా లేదా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న అనుష్క కూడా పెళ్లి వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తూ వస్తుంది.

ఆమె పెళ్లి వయసు దాటి చాలా సంవత్సరాలు అయింది.అయినా కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు, అనుష్క పెళ్లి వార్తలు ఆ మధ్య తెగ మీడియాలో హల్చల్ చేశాయి కానీ ఇప్పటి వరకు ఆమె పెళ్లి కాకపోవడంతో అనుష్క కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలలో కూడా బిజీ బిజీగా చేయని అనుష్క పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అర్థం కావడం లేదు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.అనుష్క మరియు ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు ఆమధ్య అనుకున్నారు.

ఇద్దరి కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అయిందో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలుగా కూడా అంత సూపర్ హిట్ అవుతారు అనేది అభిమానుల మాట.

Telugu Anushka, Baahubali, Krishnam Raja, Prabhas, Prabhass-Movie

కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే ఇలాంటి ప్రేమ కానీ ఇతర సంబంధాలు కానీ మా మధ్య లేదు అంటూ ప్రభాస్ గతంలో చెప్పుకొచ్చాడు.అనుష్క కూడా ఆ విషయాన్ని పలుమార్లు చెప్పింది.అయినా కూడా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అంటూ చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దానికి తోడు ఇప్పుడు ఇద్దరు కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి స్పందన తెలియజేయక పోవడంతో వీరిద్దరూ ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.ఇద్దరి కలిసి సరికొత్త జీవితాన్ని మొదలుపెడితే చాలా బాగుంటుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరిద్దరు పెళ్లి ఆలస్యం చేస్తున్నది కలిసి పెళ్లి చేసుకోవడానికా లేదంటే మరి ఏదైనా కారణం ఉందా అనేది కాలమే నిర్ణయించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube