అనుష్క సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా?

అనుష్క శెట్టి.తెలుగు సినీ జనాలకు ఈమె గురించి పరిచయం పెద్దగా అవసరం లేదు.

 Why Anushka Is Far Away From Movies , Anushka, Movies, Tollywood, Vikramarkudu, Arundhati, Bahubali Movie, Zero Size Movie-TeluguStop.com

పూరీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ బ్యూటీ.ఆ తర్వాత విక్రమార్కుడు సినిమాతో తనలోని అంద చందాలను బయటపెట్టి కుర్రకారుకు కిక్కెక్కించింది.

ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో అనుష్క కెరీర్ మంచి స్వింగ్ అందుకుంది.ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ బెంగళూరు బ్యూటీ.

వరుస సినిమాలను దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది.

అనుష్కకు అద్భుత పేరు తెచ్చిన సినిమా అరుంధతి. కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుష్కను లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మార్చింది.2009లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమాలో అనుష్క పోషించిన జేజమ్మ పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి.తన అద్భుత నటనతో జనాలను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత వచ్చిన బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది.

ఈ సినిమా అనంతరం మరిన్ని అవకాశాలతో ముందుకు సాగుతుంది అనుకున్నా.దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది అనుష్క.

ఈ సినిమా అనంతరం సినిమాలను చేయడం లేదు.

అనుష్క ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే విషయంపై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.తాజాగా దీనికి సంబంధించిన విషయం తెలిసింది.వాస్తవానికి బాహుబలి సినిమా సమయంలోనే అనుష్క జీరో సైజ్ సినిమా చేసింది.

అప్పుడు బాగా బరువు పెరిగింది.కానీ ఆ బరువు త్వరగా తగ్గలేదు.

ఈ నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలు చేయలేదట.చాలా రోజుల తర్వాత అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది.

పి.మహేష్ బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపింది.నవీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా చేస్తున్నాడు.

Why Anushka Is Far Away From Movies , Anushka, Movies, Tollywood, Vikramarkudu, Arundhati, Bahubali Movie, Zero Size Movie - Telugu Anushka, Arundhati, Bahubali, Tollywood, Vikramarkudu, Zero Size

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube