కలిగిన ఇబ్బంది చెప్పకుండానే క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న రంగమ్మత్త  

Why Anasuya Wants Apology From Spicejet Airlines-anchor Anasuya,jabardasth Comedy Show,rashmi Goutham,roja,spicejet Airlines,sudheer,telugu Viral News

ఇద్దరు పిల్లలకు తల్లయినా కూడా పడుచు పిల్లలా జబర్దస్త్‌ అందాలను ఆరబోస్తూ ఇంకా కూడా కుర్రకారును తన అందాలతో మత్తెకిస్తోంది రంగస్థలం రంగమ్మత్త అనసూయ. ఈ ఆంటీ జబర్దస్త్‌తో ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ఈమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది..

కలిగిన ఇబ్బంది చెప్పకుండానే క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న రంగమ్మత్త-Why Anasuya Wants Apology From Spicejet Airlines

తనకు సంబంధించిన షోలు, కుటుంబ విషయాలు, సామాజిక విషయాల గురించి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

ట్విట్టర్‌లో అనసూయ. తాను స్పైస్‌ జెట్‌ వారి క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నట్లుగా పోస్ట్‌ చేసింది. స్పైస్‌ జెట్‌ అనేది విమానయాన సంస్థ అనే విషయం తెల్సిందే. ఆ ఎయిర్‌ సర్వీస్‌ సంస్థను అనసూయ ఎందుకు క్షమాపణ అడుగుతుందో అర్థం కావడం లేదు.

అసలు ఏం జరిగిందే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు బుల్లి తెర వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కొందరు ఆమెతో పరిచయం ఉన్న వారు ఫోన్‌లు చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా, మరి కొందరు ఆమె పోస్ట్‌కు అసలేం జరిగింది రంగమ్మత్త అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు..

ఇదే విషయమై స్పైస్‌ జెట్‌ సంస్థ స్పందిస్తూ. అసలు ఏం జరిగిందో తమకు సమాచారం ఇవ్వాలని, తద్వార మేము పూర్తి చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని కోరడం జరిగింది. కాని అనసూయ మాత్రం అందుకు స్పందించలేదు. ఇటీవల అనసూయ జమ్ము కాశ్మీర్‌ వెళ్లి వచ్చింది.

కుటుంబ సభ్యులతో స్పైస్‌ జెట్‌ విమానంలోనే ప్రయాణం చేసి ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఏదైనా ఇబ్బంది ఎదురై ఉంటుందని, అందుకే ఆమె క్షమాపణలు కోరుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఆమె నోటి నుండి వింటే కాని తెలియదు.