అయ్యో ఈ భామను ఎవరు పట్టించుకోవడం లేదేంటి..?

సినిమా పరిశ్రమ అనేది గమ్మత్తుగా ఉంటుంది.ఎవరి జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతుందో తెలియదు.

 Why Ananya Nagella Not Getting Offers , Ananya Nagella, Krithishetti, Priya War-TeluguStop.com

కొన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నా.ఇంకా చిన్నా చితకా క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నవారు ఉన్నారు.

రాత్రి రాత్రే స్టార్లుగా ఎదిగిన వారూ ఉన్నారు.సినిమా పరిశ్రమలో నెగ్గాలంటే అందం, అభినయం ఒక్కటే చాలదు.

కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి.అందుకే ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో.? ఎవరు ఎప్పుడు స్టార్ గా మారుతారో.? ఎవరు ఎప్పుడు క్రేజ్ సంపాదించుకుంటారో? ఎవరు ఎప్పుడు స్టార్ స్థాయి నుంచి కిందికి పడిపోతారో చెప్పడం కష్టం.

ఉప్పెన లాంటి ఒకే ఒక్క సినిమాతో కృతిశెట్టి లాంటి వాళ్ళు ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు.ప్రియా వారియర్ లాంటి అమ్మాయి కన్నుకొట్టి.కోట్లాది మంది మదిని తోచింది.రాత్రి రాత్రే ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది.

అయితే కొందరు ఎంత ప్రయత్నించినా.తమలో చక్కటి టాలెంట్ ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదు.

అలా వారిలో ఓ హీరోయిన్ అనన్య నాగళ్ల.మల్లేషం సినిమాతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది.అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.నటన పరంగా అందరి చేత శభాష్ అనిపించుకుంది.అటు సోషల్ మీడియా వేదికగా తన లేలేత అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోటోలను ప్రదర్శిస్తున్నది.అయినా ఈమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

Telugu Ananya Nagella, Krithishetti, Mallesham, Pawan Kalyan, Priya Warrior, Tol

తాజాగా విడుదల అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ వకీల్ సాబ్ లోనూ అనన్య నటించింది.ఈ సినిమాలో మంచి పాత్రే పోషించింది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.అయితే ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా పేరు రాలేదు.అవకాశాలు కూడా దగ్గరికి రావడం లేదు.అందం, అభినయం ఉన్నా.

అదృష్టం కలిసి రాక ఎదగలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ.కానీ తన టాలెంట్ తనను ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయంగా భావిస్తుంది అనన్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube