విపరీతమైన ఆకలి వేస్తుందా.... కారణాలు ఇవే

సాధారణంగా మనం తీసుకొనే ఆహారం పరిమాణం బట్టి ఆకలి అనేది ఉంటుంది.ఎక్కువగా ఆహారం తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు.

 Why Am I Always Hungry-TeluguStop.com

అదే తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటే తొందరగా ఆకలి వేస్తూ ఉంటుంది.ఆలా కాకుండా కొంతమందికి ఆహారం తీసుకున్న కొంతసేపటికే ఆకలి వేయటం మొదలు అవుతుంది.

ఆలా ఆకలి వేయటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిన లేదా తగ్గినా ఈ సమస్య వస్తుంది.అందువల్ల మధుమేహం ఉన్నవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ ఆకలి సమస్య నుండి బయట పడవచ్చు.

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ ఉంటారు.అలాంటి వారికి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఎక్కువగా ఆకలి వేస్తుంది.ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉంటుంది.అందువల్ల ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ మానకుండా చేయాలి.

ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో అడ్రినలిన్, కార్టిసోల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి.దాంతో ఆకలి విపరీతంగా ఉంటుంది.

ఇటువంటి వారు ఒత్తిడిని తగ్గించుకుంటే ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.

ప్రతి రోజు నిద్ర అనేది రోజుకి 6 నుంచి 8 గంటల పాటు ఉండాలి.

ఆలా కాకుండా నిద్ర సరిగా లేని వారికి కూడా ఆకలి విపరీతంగా వేస్తుంది.అందువల్ల నిద్రకు వేళలను పాటిస్తే ఆకలి సమస్య తీరుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube