చివరి నిమిషంలో బన్నీ జనసేనకు మద్దతు వెనుక వ్యూహం ఏంటీ?  

Why Allu Arjun Supports At Janasena Party Campaigning-

అల్లు అర్జున్‌ తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి.తాజాగా అల్లు అర్జున్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కలవడం జరిగింది.జనసేన చివరి రోజు ప్రచారంలో భాగంగా రాజమండ్రి సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది.పవన్‌ కళ్యాణ్‌ ఆ ప్రచారంలో పాల్గొన్నాడు.ప్రచారంకు చివరి రోజు అవ్వడం వల్ల పెద్ద ఎత్తున ఏర్పాట్లు మరియు మీడియా మోహరించి ఉన్న సమయంలో పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా తాను నిలుస్తున్నట్లుగా మీడియా ముందుకు రావడం మాత్రమే కాకుండా, పవన్‌ కళ్యాణ్‌ సభా స్థలి వద్దకు వెళ్లాడు.

Why Allu Arjun Supports At Janasena Party Campaigning--Why Allu Arjun Supports At Janasena Party Campaigning-

Why Allu Arjun Supports At Janasena Party Campaigning--Why Allu Arjun Supports At Janasena Party Campaigning-

ఆ సమయంలో మీటింగ్‌లో పాల్గొంటున్న పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా కింద ఉన్న అల్లు అర్జున్‌ను పైకి పిలిపించాడు.పైకి వెళ్లిన అల్లు అర్జున్‌ జనసేనకు మద్దతు పలికాడు.తన కోసం వచ్చినందుకు పవన్‌ కళ్యాణ్‌ ఆలింగనం చేసుకుని మరీ అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.అల్లు అర్జున్‌ చివరి రోజు హఠాత్తుగా జనసేన మీటింగ్‌లో కనిపించడం వెనుక కారణం ఏంటీ అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మెగా హీరోలు అంతా కూడా జనసేనకు మద్దతు తెలిపారు.పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్లి రామ్‌ చరణ్‌ స్వయంగా మద్దతు పలికాడు.ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ వైకాపా అభ్యర్థి అయిన తన మిత్రుడికి మద్దతుగా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయమన్నాడు.దాంతో బన్నీ వైకాపాకు మద్దతు అనే ప్రచారం మొదలైంది.తనపై వస్తున్న వ్యతిరేకత, విమర్శలకు సమాధానంగా పుట్టిన రోజు అయిన తెల్లారే పవన్‌ కళ్యాణ్‌ మీటింగ్‌లో పాల్గొన్నాడు.

ఆ మీటింగ్‌లో బన్నీ ఏం మాట్లాడకున్నా కూడా జనసేనకు ఆయన మద్దతు ఉందని వెళ్లడి అయ్యింది.దాంతో ఆయనపై వస్తున్న విమర్శలు తగ్గి పోయాయి.ఈ వ్యూహంతోనే బన్నీ అనూహ్యంగా పవన్‌కు మద్దతు తెలిపినట్లుగా సమాచారం అందుతోంది.