విశాఖ విజ‌యం ఎవ‌రి ఖాతాలోకి... వైసీపీలో ఆ ఇద్ద‌రి నేత‌ల ఫైట్ ?

ఔను! విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తే ఈ విజ‌యం ఎవ‌రి ఖాతాలోకి వెళ్తుంది?  ఎవ‌రు గెలిచిన‌ట్టు?  ఎవ‌రు పైచేయి సాధించిన‌ట్టు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఇప్పుడు ఇదే విష‌యంపై వైసీపీ నేత‌లు కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు చేస్తున్నారు.

 Whose Account Is The Victory Of Visakha ... Fight Of Those Two Leaders In Ycp,ap-TeluguStop.com

దీనికి ప్ర‌ధాన కార‌ణం విశాఖ‌లో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు.వీరిలో ఒక‌రు మంత్రి అవంతి శ్రీనివాస్‌ఒక‌వైపు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి ప‌రిధిలో  వైసీపీని ప‌రుగులు పెట్టించేందుకు కృషి చేస్తూనే మ‌రోవైపు విశాఖ‌లో వైసీపీ పాగా వేసేందుకు త‌న‌వంతు కృషి చేస్తున్నారు.

ఇటీవ‌ల ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం చేప‌ట్టిన ఉద్య‌మంలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.

దీంతో అవంతి వ‌ర్గం విశాఖ‌లో వైసీపీ గెలిస్తే త‌మ నాయ‌కుడి హ‌వా పెరుగుతుంద‌ని అంచ‌నాలు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే అదే స‌మ‌యంలో విశాఖలో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి దూకుడ‌గా ఉన్నారు.ఆయ‌న ఇక్క‌డ వైసీపీ జెండా ఎగ‌ర‌వేసేందుకు ప్ర‌తిష్టాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు.ఇప్ప‌టికే పాద‌యాత్ర నిర్వ‌హించారు.ఇంటింటికీ తిరుగుతున్నారు.

నిజానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి కూడా ఆయ‌న విశాఖ‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.

Telugu Ap, Avanti Srinivas, Latest, Victory, Visakhapatanam, Ysrcp-Telugu Politi

ఉత్త‌రాంధ్ర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న సాయిరెడ్డిఇక్క‌డ పార్టీని గెలిపించ‌డం ద్వారా పార్టీలో త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు.ఈ క్ర‌మంలో ఈయ‌న మేధావుల‌ను, సామాజిక వ‌ర్గాల నేత‌ల‌ను కూడా ఏక‌తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.ఈ క్ర‌మంలో విశాఖ‌లో వైసీపీ జెండా ఎగుర‌వేస్తే క‌చ్చితంగా అది సాయిరెడ్డి విజ‌యం కింద‌కే వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు తీర్మానించేశారు.

అయితే అవంతి వ‌ర్గం మాత్రం త‌మ నాయకుడితే పైచేయి అవుతుంద‌ని చెబుతోంది.

ఇలా ఇరు వ‌ర్గాలు కూడా ఎవ‌రికి వారు అంచ‌నాలు వేసుకుని ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఎవ‌రు విజ‌యం సాధించినా.పార్టీకి బ‌లోపేతం అవుతుంద‌నే రీజ‌న్‌ను ప‌క్క‌న పెట్టి వ్య‌క్తిగ‌త ఆధిప‌త్యం కోసం పోరాడుతున్నార‌న్న వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తోంది.

ఇది పార్టీకి మేలు చేస్తుందా ?  కీడు చేస్తుందా ? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.రెండు రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు ఎవ‌రికి వారే ధీమా వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube