Rats Catching Job : వారెవ్వా..ఎలుకలు పట్టే జాబ్ అదుర్స్..భారీ జీతం

చాలా మంది ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.మరికొందరు అయితే చాలీచాలని జీతంతో ఉద్యోగాలు చేస్తున్నారు.

 Whore..rat Catching Job Adurs Huge Salary , Rats, Employee, Viral Latest, News V-TeluguStop.com

అయితే ఇటువంటి సమయంలో ఓ ఉద్యోగ ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.నెట్టింట ప్రతి రోజూ అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి.

తాజాగా ఈ ప్రకటన సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.ఇంతకీ అదేంటంటారా? ఎలుకలు పట్టే ఉద్యోగం.వినడానికి మీకు ఆశ్చర్యంగానే ఉంది కదూ.అవునండి.ఎలుకలు పట్టడానికి కూడా జాబ్స్ ఇస్తున్నారు.ఈ ఉద్యోగానికి శాలరీ తక్కవేం కాదండోయ్.సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అంత సంపాదించలేరు.ఏకంగా రూ.1.38 కోట్లు జీతం.అందుకే ఈ జాబ్ ప్రకటన అందర్నీ ఆకర్షిస్తోంది.

ఈ ఎలుకలు పట్టే ఉద్యోగ ప్రకటన ఇచ్చింది సాధారణ సంస్థో లేక బాగా డబ్బులున్న ఇంటి సభ్యులో కారు.

సాక్షాత్తూ అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఈ ప్రకటన చేశాడు.యుఎస్ న్యూయార్క్ మేయర్ అయిన ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టుకునే జాబ్ ప్రకటన చేయడంతో ప్రపంచమంతా దీని గురించి చర్చ నడుస్తోంది.

ఈ మధ్యకాలంలో న్యూయార్క్ నగరం అంతా ఎలుకల గోల ఎక్కువయ్యింది.దీంతో చాలా మంది ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.అందుకే ప్రజల కోసం మేయర్ ఈ కొత్త ఉద్యోగాన్ని సృష్టించాడు.ఎలుకలు పట్టే ఉద్యోగులకు వార్షిక వేతనం రూ.1.38 కోట్లు ఉంటుందని ప్రకటించడంతో ఈ ఉద్యోగానికి చాలా మంది పోటీ పడే అవకాశం ఉంది.న్యూయార్క్ లో ఎలుకలపై పోరాడగలరా? ఎలుకలను పట్టే నైపుణ్యం మీలో ఉంటే వెంటనే ఈ జాబ్ కు అప్లై చేయండి అంటూ ప్రకటన విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రకటన గురించి తెలుసుకున్న కొందరు నవ్వుకుంటుంటే మరికొందరు మాత్రం మంచి జాబ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube