అఖండలో బాలయ్య విగ్గు కోసమే అంత ఖర్చు చేశారట!

Whopping Amount Spent On Nbks Wig For Akhanda

నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ’.ఈ సినిమా సూపర్ సక్సెస్ తో దూసుకు పోతుంది.

 Whopping Amount Spent On Nbks Wig For Akhanda-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర హౌస్ ఫుల్ తో థియేటర్స్ కళకళ లాడుతున్నాయి.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.

 Whopping Amount Spent On Nbks Wig For Akhanda-అఖండలో బాలయ్య విగ్గు కోసమే అంత ఖర్చు చేశారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పై పాజిటివ్ టాక్ వచ్చింది.

అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.

ఇక నందమూరి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అఖండ విజయం అవ్వడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా టీమ్ అందరికి అభినందనలు చెప్పారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించాడు.బోయపాటి శ్రీను బాలయ్యను ఎప్పటికప్పుడు కొత్తగా అందంగా ప్రెసెంట్ చేస్తాడు.ఈయన చూపించినంత అందంగా మరే డైరెక్టర్ చూపించడనే చెప్పాలి.బోయపాటి, బాలయ్య కాంబోలో వచ్చిన మూడు సినిమాల్లో కూడా బాలయ్య అందగానే కనిపించి ఫ్యాన్స్ సంతోష పడేలా చేసాడు.

Telugu Akhanda, Akhanda Wig, Balakrishna, Boyapati Srinu, Fifty Rupees, Muralikrishna, Nbks Wig Amount, Amountnbks-Movie

ఇక తాజా సమాచారం ప్రకారం అఖండ సినిమాలో బాలయ్య అంత అందంగా కనిపించడం వెనుక విగ్గు కూడా ఒక కారణమట.ఈ సినిమాలో బాలయ్య విగ్గు కోసమే నిర్మాతలు లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం.ఈ సినిమాలో బాలయ్య విగ్గుకి ఏకంగా 50 లక్షల రూపాయలను ఖర్చు చేశారట.39 లక్షలను ఖర్చు చేసి మూడువిగ్గులను కొనుగోలు చేశారట మేకర్స్.

Telugu Akhanda, Akhanda Wig, Balakrishna, Boyapati Srinu, Fifty Rupees, Muralikrishna, Nbks Wig Amount, Amountnbks-Movie

ఈ సినిమాలో మురళీకృష్ణ పాత్రకు ఈ మూడు విగ్గులను ఉపయోగించారని సమాచారం.అంతేకాదు బాలయ్య లుక్ కోసం హెయిర్ స్పెసలిస్ట్ ను నియమించారట.ముంబైకు చెందిన స్పెసలిస్ట్ కు రెమ్యునరేషన్ గా 12లక్షల రూపాయలను చెల్లించారని సమాచారం.మొత్తానికి అఖండలో బాలయ్య విగ్గుకోసమే 50 లక్షలను ఖర్చు చేసారని తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఈ ఖర్చులేమి పెద్ద లెక్కకాదు అనే చెప్పాలి.

#Fifty Rupees #Boyapati Srinu #Akhanda Wig #AmountNBKs #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube