నడిగర్‌ ఎన్నికలు పూర్తి కాని విశాల్‌ పరిస్థితి ఏంటీ

పలు వివాదాలు, గొడవలు, వాద ప్రతి వాదాల నడుమ ఎట్టకేలకు నడిగర్‌ సంఘం ఎన్నికలు ముగిశాయి.అసలు నడిగర్‌ ఎన్నికల సంఘం జరుగుతాయా అంటూ అనుమానాలు వ్యక్తం అయిన సమయంలో కోర్టు కొన్ని కండీషన్స్‌ పెట్టి ఎన్నికల నిర్వాహణకు ఓకే చెప్పింది.

 Who Will Win In Nadigar Sangam Elections-TeluguStop.com

ఎన్నికలు జరిగినా ఫలితాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.ఎందుకంటే కోర్టులో కేసు ఉన్న కారణంగా కేసు ఫైనల్‌ తీర్పు వచ్చేప్పటి వరకు లేదంటే కోర్టు ఆదేశించే వరకు ఎన్నికల ఫలితాలను వెళ్లడించవద్దని కోర్టు తీర్పు ఇచ్చింది.

నడిగర్‌ ఎన్నికలు పూర్తి కాని

కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు అయితే జరిగాయి కాని ఫలితాలు హోల్డ్‌లో ఉంచారు.ఓట్ల లెక్కింపుకు సమయం తీసుకోనున్నారు.ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసు ఎప్పటికి ఫైనల్‌ తీర్పు వచ్చేనో అంటూ ఇరు వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కోర్టు తీర్పు సంగతి ఏమో కాని ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

ప్రస్తుత అధ్యక్షుడు అయిన విశాల్‌ గెలిచేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నడిగర్‌ ఎన్నికలు పూర్తి కాని

అధ్యక్షుడు విశాల్‌ మరోసారి గెలుపు కోసం బాగానే కష్టపడ్డాడు.కాని విశాల్‌ కు వ్యతిరేకంగా శరత్‌ కుమార్‌ వర్గం వారు తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేశారు.విశాల్‌ నడిగర్‌ సంఘం నిధులను దుబారా చేశారని ఆయన చేసిన ఖర్చు లెక్కలు కూడా చెప్పడం లేదని, అందుకే ఆయనకు ఓటు వేయవద్దని, ఆయన చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు అంటూ భాగ్యరాజా ప్యానల్‌ వారు ఆరోపించారు.

ఈ విషయమై ఎక్కువగా ప్రచారం జరిగిన నేపథ్యంలో విశాల్‌ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.మొత్తానికి విశాల్‌ గెలుపు కంటే ఓటమి శౄతం ఎక్కువ అంటూ తమిళ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube