గ్రేట‌ర్ మ‌దిలో ఎవ‌రు... కేసీఆర్ టార్గెట్‌గా క్లైమాక్స్ ఇదే.. ?

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చార‌ సంద‌డి ముగిసింది.ఇక‌, ఎన్నిక‌ల పోలింగ్ కొద్ది సేప‌ట్లోనే ప్రారంభం కానుంది.

 Who Will Win In Ghmc Election.. This Is The Kcr Climax, Trs, Telangana, Ghmc Ele-TeluguStop.com

అయితే ఇంత‌లోనే అనేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.అనేక ఊహాగానాలు వ‌స్తున్నాయి.

మ‌రీ ముఖ్యంగా కేసీఆర్ పైనే ఈ వ్యాఖ్య‌లు, చ‌ర్చ‌లు ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.దీనికి కార‌ణం ముందు గ్రేట‌ర్ ఫైట్ ను లైట్‌గా తీసుకున్న తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు త‌ర్వాత అనూహ్యంగా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు.

అంటే ఈ మ‌ధ్యలో ఏదో జ‌రిగింది ? అదేంట‌నేదే ఆస‌క్తిగా మారింది.కేసీఆర్‌ను గ‌మ‌నిస్తే గ్రేట‌ర్‌లో పెద్ద‌గా చెప్పుకొనేందుకు ఏమీ క‌నిపించ‌డం లేదు.

గ‌తంలో చంద్ర‌బాబు, వైఎస్ హ‌యాంలోనే అనేక ప్రాజెక్టులు వెలిశాయి.మెట్రో, పీవీ ఎక్స్ ప్రెస్ వే, సైబ‌రాబాద్ ఇలా అనేకం అప్ప‌ట్లోనే వ‌చ్చాయి.కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి ఏ ఒక్క ప్రాజెక్టు చేప‌ట్ట‌లేదు.దీనినే బీజేపీ టార్గెట్ చేసింది.

కేసీఆర్ వ‌చ్చాడు హైద‌రాబాద్‌కు ఏం చేశారు ? అని బీజేపీ నాయ‌కులు నిల‌దీశారు.దీంతో నిజంగానే కేసీఆర్ హైద‌రాబాద్‌కు ఏంచేశార‌నే చ‌ర్చ సాగుతోంది.స‌రే! న‌గ‌రానికి చేయ‌క‌పోయినా న‌గ‌ర జ‌నాభాకు అయినా కేసీఆర్ ఏదో ఒకటి చేసి ఉండాలి క‌దా  కానీ, అది కూడా క‌నిపించ‌డం లేద‌ని శివారు ప్రాంతాల ప్ర‌జలే అంటున్నారు.

Telugu Congress, Dubbaka, Ghmc, Harishrao, Latest, Telangana, Ts, Votes, Win-Tel

ఇక‌, కరోనా సమయంలో టెస్ట్ లు సరిగా చేయకపోవటం, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవటంలో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.ఈ విష‌యంలో హైకోర్టు ఇప్ప‌టికీ ప్ర‌శ్నిస్తూనే ఉంది.దీంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌లు విసిగిపోయారు.

మరో వైపు ఆరేళ్ల నుంచి పేదవాళ్లను ఊరిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్క‌డిగొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సీఎం కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు ఎన్నో.

కానీ వాస్తవంగా పూర్తి అయిన ఇళ్ళు నామమాత్రమే.

ఇక‌, నాలా విష‌యంలోనూ ఆయ‌న చెప్పింది ఒక‌టి చేసింది ఒక‌టి.

ఇలా మొత్తంగా అనేక వ్య‌తిరేక అంశాలు వ‌ర్కవుట్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.దీంతో కేసీఆర్ వైఖ‌రిపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం ఉంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

కొస‌మెరుపు: ఎంత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ గ్రేట‌ర్ నాడి మాత్రం కేసీఆర్‌కు అనుకూలంగా ఉండ‌డం.ఎంత బ‌ల‌మైన ప్ర‌చారం ఉన్న‌ప్ప‌టికీ బీజేపీపై గ్రేట‌ర్ వాసికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube