ముగ్గురూ ... ముగ్గురే... పై చేయి ఎవరిదో...?

ఏపీలో ప్రస్తుతం రాజకీయం చాలా చిత్ర విచిత్రంగా ఉంది.ఇక్కడ పోటీ పడేందుకు సిద్ధం అవుతున్న ప్రధాన పార్టీలు మూడూ బలమైన పార్టీలుగానే ముద్రపడ్డాయి.

 Who Will Succeed In Elections In Andhra Pradesh-TeluguStop.com

టీడీపీ, జనసేన, వైసీపీ.ఈ పార్టీల అధినేతలు ముగ్గురూ… జనాలను ప్రభావితం చేసి అధికారం దక్కించుకునే అంత స్థాయికలిగిన వారే.అందుకే… రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారం దక్కించుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది.ఇక సామజిక వర్గాల లెక్కల ప్రకారం చూసుకున్నా… ఈ మూడు పార్టీల అధినేతలు ఏపీలో మూడు ప్రధాన సామజిక వర్గాలకు చెందినవారు కావడం….

ఈ మూడు పార్టీలకూ భారీ ఎత్తున సానుభూతి పరులు ఉండడం, ప్రజల్లో ఈ ముగ్గురి పట్ల విపరీతమైన అభిమానం ఉండడం…ఇవన్నీ ఆయా పార్టీలకు కలిసొచ్చే అంశాలే.టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని పవన్ ఈ ముగ్గురిలో ఎవరికి సీఎం కుర్చీ దక్కుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

అయితే ఈ ఆసక్తి అంతా కేవలం ఏపీకే పరిమితం కాలేదు.ఎందుకంటే.వచ్చే ఏడాది దక్షిణాదిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే.దీంతో అందరి కళ్లూ ఏపీపైనే ఉన్నాయి.ఈ ముగ్గురు నాయకుల ప్రస్తుత రాజకీయ అడుగులు పరిశీలిస్తే… జగన్‌.పవన్‌లు సెంటిమెంట్‌తో ముందుకు వెళ్తున్నారు.

ఇక, అధికార పార్టీ టీడీపీ అధినేత సంక్షేమ నినాదంతో దూసుకుపోతోంది.

ఇక, సెంటిమెంట్ ను బాగా నమ్ముకున్న జగన్‌.తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లారు.గత ఏడాది నవంబరు నుంచే ఆయన ప్రజల్లో ఉంటున్నారు.

ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీ అంతా దాదాపు చుట్టేశారు.ఇప్పటికే ఆయన చేయించుకున్న సర్వేల్లోనూ… అధికారం దక్కే ఛాన్స్ ఉన్నట్టు ఫలితాలు రావడం… జగన్ లో ఉత్సాహం పెంచింది.

అందుకే పార్టీలో పూర్తిస్థాయి ప్రక్షాళన మొదలుపెట్టి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే….ఆయన ముందుగా ఏదో కొన్ని సీట్లు దక్కితే చాలు అన్నట్టుగా రాజకీయం మొదలుపెట్టి.నన్ను సీఎం అనండి అంటూ… తన అభిమానులతో పిలిపించుకునే వరకు ఆయన వెళ్ళిపోయాడు.

ఇక చంద్రబాబు విషయానికి వస్తే… తన ప్రభుత్వం పెద్దసంఖ్యలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు చే స్తోందని చెబుతున్నారు.గతంలో ఇటువంటి పథకాలకు కొంత వ్యతిరేకంగా ఉన్నా ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో వాటిని చేపట్టి నిర్వహిస్తున్నారు.రూ.1,000 పింఛను, నిరుద్యోగ భృతి, పండగ కానుకలు, బీసీ వర్గాలకు పనిముట్ల పంపిణీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ, రైతులకు రూ.లక్షన్నర వరకూ రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష వరకూ సాయం, పేదలు చనిపోతే చంద్రన్న బీమా కింద రూ.5 లక్షల సాయం వంటివి తనకు మళ్ళీ అధికారం తీసుకు వస్తామని బాబు నమ్ముతున్నాడు.ఇది ఇలా ఉంటే అధికారం దక్కించుకునేందుకు జగన్, పవన్, బాబు లు ఒకరి పై ఒకరు విమర్శలు…ప్రతి విమర్శలు చేసుకుంటూ… ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube