'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం ఏపీ బయ్యర్ల పరిస్థితి ఏంటీ? వారి నష్టం ఎవరు భరాయించాలి?

రామ్‌ గోపాల్‌ వర్మ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించి, పంతంతో విడుదల చేసిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదల అయ్యింది.ఏపీలో ఈ చిత్రం విడుదల కాలేదు.

 Who Will Responsible About Lakshmis Ntr In Ap-TeluguStop.com

విడుదలకు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రైట్స్‌ను అమ్మేశారు.ఏపీలో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో దాదాపు పది కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది.

అయితే ఏపీలో సినిమా విడుదల కాకపోవడంతో ఆ నష్టంను ఎవరు భరాయిస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఏపీ రైట్స్‌ను కొనుగోలు చేసిన బయ్యర్లు తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

సినిమాను ఏపీలో విడుదల కాకుండా స్టే విధించిన కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లిందని, ఆ నష్టంను ఎవరు భర్తీ చేయాలంటూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ బయ్యర్లు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.తమకు జరిగిన నష్టంకు ఎవరు బాధ్యులు అంటూ కోర్టును బయ్యర్లు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఏపీలో సినిమా విడుదల కాకపోవడంతో తెలంగాణలో సినిమా విడుదల అవ్వడం వల్ల తమకు భారీ నష్టం తప్పడం లేదు అంటూ బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు.

సినిమా బయ్యర్లు హై కోర్టును ఆశ్రయించారు అంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.నిర్మాత మరియు దర్శకుడు కలిసి బయ్యర్లను హైకోర్టుకు వెళ్లేలా చేశారు అంటూ సమాచారం అందుతోంది.మరో వైపు హైకోర్టు స్టేను ఎత్తి వేయాలంటూ నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

సుప్రీం కోర్టులో అందుకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్నాయి.మొత్తానికి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చుట్టు రాజకీయం తిరుగుతోంది.

అది ఎటు వెళ్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube