మునుగోడులో జెండా పాతేదెవరు ?

దేశంలోనే హాట్ టాపిక్ అయిన మునుగోడు సెగ్మెంట్, పాలిటిక్స్ ను షేక్ చేసింది.మరి మునుగోడులో జెండా పాతేదెవరు ? అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధిస్తుందా ? ప్రభుత్వం పై తొడ గొట్టి మరీ యుద్దానికి దిగిన రాజగోపాల్ రెడ్డి సత్తా చాటేనా ? కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజల మనసు గెలిచినా ? ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న నేతల భవితవ్యం మరి కొన్ని గంటల్లోనే తేలనుంది.

 Who Will Put The Flag In The Munugodu ,munugodu, Trs Party, Rajagopal Reddy, Con-TeluguStop.com

మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధమైంది.రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.నల్గొండ పట్టణంలోని అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.ఈ కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు.15 రౌండ్స్ లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్ లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.

మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్ లల్లో లెక్కిస్తారు.మొదట పోలింగ్ ఏజెంట్ లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలల్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు.

ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ ,మైక్రో అబ్జర్ వర్లను నియమించారు.మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదల అవుతుంది.

చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల అవుతాయి.అంటే అప్పుడే పూర్తి ఫలితం తేలుతుంది.

ఇలా 15 రౌండ్స్ లల్లో 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన అన్ని ఓట్లు లెక్కిస్తారు.ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు.

Telugu Congress, Munugodu, Rajagopal Reddy, Ro Rohit Singh, Trs, Vinaykrishna-Po

కాగా మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కిస్తారు.ఆ తర్వాత నారాయణపురం,మునుగోడు,చండూర్ మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు అధికారులు.కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, ఆర్ఓ రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది.

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్ పీఎఫ్ బలగాలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ నమోదు అయింది.కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్ లను నియమించుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube