బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదో వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అతనేనా?

Who Will Eliminate This Week From Bigg Boss Season 5 Telugu

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.అయినప్పటికీ ఈ షోకు పరవాలేదనిపించే స్థాయిలో రేటింగ్స్ వస్తుండటం గమనార్హం.

 Who Will Eliminate This Week From Bigg Boss Season 5 Telugu-TeluguStop.com

ఈ షోలో తొలి మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా నాలుగో వారం మాత్రం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా ఐదో వారం కూడా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వస్తుండటం గమనార్హం.

టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడానికి బిగ్ బాస్ నిర్వాహకులు సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Who Will Eliminate This Week From Bigg Boss Season 5 Telugu-బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదో వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అతనేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఎక్కువమంది కంటెస్టెంట్లు గొడవలు పడుతుండగా ప్రేక్షకులకు పరిచయం లేని కంటెస్టెంట్లు ఎక్కువమంది ఉండటం షోకు మైనస్ గా మారుతోంది.ఈ వారం ఎలిమినేషన్ కు ఏకంగా 9 మంది కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోని 8 మంది సభ్యులు షణ్ముఖ్ జశ్వంత్ ను నామినేట్ చేయగా నామినేషన్ తర్వాత షణ్ముఖ్ బిహేవియర్ లో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలుస్తోంది.

Telugu Bigg Boss, Bigg Boss, Jaswanth Padala, Lobo, Telugu Show, Eliminate-Movie

షణ్ముఖ్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో సిరి, జెస్సీలతో మాత్రమే క్లోజ్ గా ఉన్నారు.లోబో, జెస్సీలలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.హౌస్ లో బిహేవియర్ వింతగా ఉండటం లోబోకు మైనస్ అయింది.

Telugu Bigg Boss, Bigg Boss, Jaswanth Padala, Lobo, Telugu Show, Eliminate-Movie

తొలి మూడు వారాలు బిగ్ బాస్ హౌస్ నుంచి అమ్మాయిలు బయటకు రాగా ప్రస్తుతం వరుసగా హౌస్ నుంచి అబ్బాయిలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుండటం గమనార్హం.మరి లోబో నిజంగా ఎలిమినేట్ అవుతాడో లేక మరో కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడో చూడాల్సి ఉంది.

#Bigg Boss #Jaswanth Padala #Lobo #Eliminate #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube