మహేష్ కి సాధ్యపడుతుందా ? లేక పవన్ కా?

సైలంట్ గా విడుదలై రికార్డులను ఎగరేసుకుపోయింది శ్రీమంతుడు.బాక్సాఫిస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ పునరాగమన్నాన్ని ఘనంగా చాటిన శ్రీమంతుడు ఒపెనింగ్స్ రికార్డులను ఖాతాలో వేసుకుంది.

 Who Will Break Srimanthudu Openings?-TeluguStop.com

ఇప్పుడు ఇండస్ట్రీ చూపంతా వాటి మీదే.భారి అంచనాల మధ్య విడులైన రామ్ చరణ్ బ్రూస్ లీ వాటిని అందుకోవడంలో విఫలమై మహేష్ ఓపెనింగ్స్ ని దాటలేకపోయింది.

మరి ఆ రికార్డులను దాటేదెవరు? ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న నాన్నకు ప్రేమతో మీద భారి అంచనాలు నెలకొని ఉన్నా, ఎన్టీఆర్ ప్రస్తుత ఫామ్ , సుకుమార్ గత చిత్రం 1-నేనొక్కడనే డిజాస్టర్ గా నిలవడంతో ఈ చిత్రం ఏమేరకు రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టుకుంటుంది అనేది అనుమానంగా మారింది.సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం తరువాతి పెద్ద సినిమాలు.

ఈ రెండు సినిమాలు పోటి పడువచ్చు అనే వార్త సినీవర్గాల్లో వినబడుతోంది.బ్రహ్మోత్సవం ఏప్రిల్ లో రానుండగా, సర్దార్ కూడా అదే సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రెండు చిత్రాల్లోనే ఏదోకటి శ్రీమంతుడు ఖచ్చితంగా దాటవచ్చు.గబ్బర్ సింగ్ బ్రాండ్ తో వస్తుండటం సర్దార్ కు అదనపు బలం కాగా బ్రహ్మోత్సవం సాఫ్ట్‌ సినిమా కావడం మహేష్ కు చిన్న లోటు.

మరి గెలిచేదెవరో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube