విశ్లేషణ : ఈవారం బిగ్‌బాస్‌ నుండి బయటకు వచ్చేది ఎవరు

తెలుగు బిగ్ బాస్ ఆరవ వారంలో కి ఎంటర్ అయింది.ఈ వారంలో మొత్తం 9 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

 Who Will Be Eliminate 6th Week From Bigg Boss 4  Big Boss 4, Telugu, Kumar Sai,-TeluguStop.com

ఈ తొమ్మిది మంది లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్న ప్రశ్న.సాధారణంగా ఈ ప్రశ్నకు ప్రేక్షకుల అందరి వద్ద ఏదో ఒక సమాధానం ఉండేది.

కానీ ఈ సారి మాత్రం ఈ ప్రశ్న చాలా కఠినంగా మారింది.ఈవారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారు అలా ఉన్నారు.

గత వారం అంతకు ముందు వారాల్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం లో ఒక క్లారిటీ ఉంది.ముఖ్యంగా గత వారంలో సుజాత వెళుతుందని చాలామంది బలంగా నమ్మారు.

అంతా అనుకున్నట్లుగానే అదే నిజమైంది.ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అయిన వారిలో కుమార్ సాయి వీక్ కంటెస్టెంట్ అంటూ కొందరు అనుకుంటున్నారు.

కానీ అతడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

Telugu Abhijith, Akhil, Big Boss, Diwi, Harika, Kumar Sai, Lasya, Noel, Telugu-M

ఇటీవలే అతడిని గంగవ్వ నాచురల్‌ గా ఉంటాడు అంటూ అతడికి కితాబు ఇచ్చింది.కనుక అతడు షో లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.అతడు కాకుండా ఇంకా ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో అరియానా మరియు మోనాల్‌ లకు కాస్త తక్కువ స్కోప్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది.

వారిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.వారు మాత్రమే కాకుండా దివి మరియు అఖిల్ కూడా కాస్త లో ఓట్లతో కనిపిస్తున్నారు.వీళ్ళతో పోలిస్తే లాస్య, నోయల్, హారిక లు కాస్త ఎక్కువ ఓట్లు వస్తున్నట్లుగా అనిపిస్తుంది.చివరకు ఎవరు ఎలిమినేట్ అయ్యే విషయంలో మాత్రం సస్పెన్స్ నెలకొనివుంది.

ఈ వారం కూడా అభిజిత్ ఈజీగా సేవ్‌ అయ్యే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.కచ్చితంగా అభిజిత్‌ సేవ్‌ అయ్యి పోతాడు.

మిగతా ఎనిమిది మందిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది చాలా అస్పష్టంగా ఉంది.శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.

శనివారం ఎపిసోడ్ షూట్‌ పూర్తి అయిన తర్వాత క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube