బిగ్ బాస్ షో విన్నర్ ఫిక్స్.. రన్నర్ ఎవరంటే..?  

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విజయవంతమైన షోగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ ప్రస్తుతం ప్రసారమవుతోంది.

TeluguStop.com - Who Will Be Bigg Boss Show Season 4 Runner

గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ అవుతాడని బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు నాలుగు వారాల ముందు నుంచే నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆశ్చర్యం ఏమిటంటే శనివారం ఎపిసోడ్ లో ఇతర కంటెస్టెంట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభిజిత్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పారు.

దీంతో ఈ సీజన్ విన్నర్ అభిజిత్ కావచ్చని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.అభిజిత్ విన్నర్ అని ప్రేక్షకులు సైతం దాదాపుగా ఫిక్స్ కావడంతో రన్నర్ ఎవరనే చర్చ జరుగుతోంది.

TeluguStop.com - బిగ్ బాస్ షో విన్నర్ ఫిక్స్.. రన్నర్ ఎవరంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్, అఖిల్, అరియానా, అవినాష్ లు ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ కాగా మోనాల్ లేదా అరియానాలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రన్నర్ కోసం అవినాష్, సొహైల్, అఖిల్, అరియానా, మోనాల్, హారిక పోటీ పడుతున్నారు.

రన్నర్ కోసం చాలామంది పోటీ పడుతున్నా వీరిలో అఖిల్, సొహైల్, అవినాష్ లలో ఎవరో ఒకరు రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.మోనాల్ ఇప్పటికే ఎలిమినేట్ కావాల్సి ఉన్నా ఆమెను బిగ్ బాస్ కావాలనే కాపాడుతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కొన్నిసార్లు ఆమె అతి చేస్తుందని ఈ వారం లేదా వచ్చే వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హారిక ఇప్పటికే ఎలిమినేట్ కావాల్సి ఉన్నా అభిజిత్ తో లవ్ ట్రాక్ ఆమెకు ప్లస్ అయిందని అయితే ఆ లవ్ ట్రాక్ రన్నర్ ను మాత్రం చేయలేదని తెలుస్తోంది.

అఖిల్ కు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా సీక్రెట్ రూం నుంచి వచ్చిన తరువాత అతని కోపం కొంతవరకు మైనస్ గా మారుతోంది.విన్నర్, రన్నర్ ఎంపికలు ప్రేక్షకుల అంచనాలను అనుగుణంగానే జరుగుతాయో లేక బిగ్ బాస్ ఎలిమినేషన్లలా విన్నర్, రన్నర్ విషయంలో కూడా బిగ్ బాస్ ట్విస్టులు ఇస్తాడేమో చూడాల్సి ఉంది.

#Avinash #BiggBoss #Sohail #Akhil #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Who Will Be Bigg Boss Show Season 4 Runner Related Telugu News,Photos/Pics,Images..