బిగ్‌బాస్‌ : నాగార్జున.. ఎన్టీఆర్‌.. కాదు కాదు వెంకటేష్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత ఎవరో రేపటి ప్రత్యేక ఎపిసోడ్‌లో తేలిపోనుంది.మొదటి నుండి కూడా కౌశల్‌ విజేత అంటూ బలమైన టాక్‌ వినిపిస్తుంది.

 Who Will Announce Bigg Boss 2 Finals Winner-TeluguStop.com

కౌశల్‌ ఆర్మీ ఏస్థాయిలో బటయ ప్రభావం చూపుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రికార్డు స్థాయిలో కౌశల్‌కు ఓట్లు పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

మరికొన్ని గంటల్లో కౌశల్‌ను విజేతగా ప్రకటిస్తారని కౌశల్‌ ఆర్మీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరో వైపు ఇతర ఫైనలిస్ట్‌ల ఫ్యాన్స్‌ కూడా తమ వారే గెలుస్తారనే నమ్మకంతో ఉన్నారు.

ఇక బిగ్‌బాస్‌ వారాంతం ఎపిసోడ్‌ను ఒక రోజు ముందే ప్లాన్‌ చేస్తారనే విషయం తెల్సిందే.అంటే ముందు రోజు చిత్రీకరించి, ఆ తర్వాత రోజు ప్రసారం చేస్తారు.ఇక రేపటి ఎపిసోడ్‌ను నేడు చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.నిన్న మొన్నటి వరకు ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌కు నాగార్జున, ఎన్టీఆర్‌లలో ఒకరు వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది.

నాగార్జున ఇటీవలే ‘దేవదాస్‌’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హాజరు అయిన విషయం తెల్సిందే.అందుకే ఫైనల్‌ ఎపిసోడ్‌కు ఆయన వచ్చే ఛాన్స్‌ లేదు.

నాగార్జున తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు ఎన్టీఆర్‌.మొదటి సీజన్‌ హోస్ట్‌ అయిన ఎన్టీఆర్‌ ఈ షో ఫైనల్‌ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి.కాని తాజాగా మరో పేరు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌లో కనిపించబోతున్నాడట.ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.వెంకీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లుగా కొందరు చెబుతుండగా, మరి కొందరు మాత్రం బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ కోసం వెంకీ హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube