వకీల్ సాబ్ సినిమాకు మొదట ఎంపికైన హీరో ఎవరంటే?

డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.సినిమా మోషన్ పోస్టర్ ను మొదలుకొని ట్రైలర్, సినిమా వరకు అన్నీ రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే.

 Who Was The First Hero Of The Film Vakil Saab-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా హిట్ కావాలని అభిమానులు మొక్కని మొక్కు లేదని చెప్పవచ్చు.వకీల్ సాబ్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కినా మన తెలుగు నేటివిటీకి దగ్గట్టు సినిమాలో మార్పులు చేర్పులు చేసి సినిమాను రూపొందించారు.

అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప ఏ హీరో ఉన్నా ఈ సినిమాకు అంతగా క్రేజ్ రాదని అభిమానులు చెబుతున్న మాట.

 Who Was The First Hero Of The Film Vakil Saab-వకీల్ సాబ్ సినిమాకు మొదట ఎంపికైన హీరో ఎవరంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అయితే వకీల్ సాబ్ సినిమా కథను ముందుగా నిర్మాత దిల్ రాజు మొదట నందమూరి బాలకృష్ణకు వినిపించాడట.అయితే ముందుగానే పలు సినిమాలకు కమిట్ అవడంతో ఈ సినిమాను చేయడానికి బాలకృష్ణ నో చెప్పాడట.

అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కాని, ఇది నిజమే అన్నంతగా పుకారు షికార్లు చేస్తుంది.అయితే ఈ రూమర్ లపై నిర్మాత దిల్ రాజు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

మరి ఈ రూమర్ పై నిర్మాత దిల్ రాజు స్పందిస్తాడా లేడా అనేది చూడాల్సి ఉంది.

#@PawanKalyanFan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు