క్షీరసాగర మథనంలో పుట్టిన లక్ష్మీదేవిని ఎవరు తీసుకున్నారు?

దేవదేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రంలో మందగిరిని కవ్వంగా వాడి వాసుకి అనే పాము తాడుగా వాడుతు… క్షీర సాగర మథనాన్ని చిలుకుతారు. అప్పుడు క్షీర సముద్రంలోంచి లక్ష్మీ దేవి పుడుతుంది.

 Who Took Lxmidevi Born In Ksheera Sagara Mathanam, Ksheera Sagara Mathanam, Lxmi-TeluguStop.com

 పాల సముద్రంలోని మీగడతో బ్రహ్మ లక్ష్మీ దేవి శరీరాన్ని చేశాడట. క్రొమ్మేఘవు మెరుపులు ఆమె శరీరం మెరిసేలా చేశాడట.

 అంతే కాదండోయ్ మహా లక్ష్మీ పుట్టిన వెంటనే ఆమెకు దేవతలందరూ కలిసి మంగళ స్నానం చేయించారట. ఆ తర్వాత సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు సమర్పించాడట.

 వరుణుడు వైజయంతి మాల ఇవ్వగా… విశ్వకర్న సువర్ణ అలంకారాలు ఇస్తాడు.

ఆమె వైపే ఓర చూపుతో చూస్తున్న em>విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి దేవ దానవులతో.

 మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు. శ్రీ మహా విష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళిగా ఉంటాను అని చెప్పి ఆ మహా విష్ణువు మెడలో పూల మాల వేసిందట.

 అప్పుడు సముద్రుడు కౌస్తుబమణిని తీసుకొచ్చి శ్రీ మహా విష్ణువుకు ఇచ్చాడు. లక్ష్మీ దేవిని మొదటి చూపులోనే ఇష్టపడ్డ ఆ మహా విష్ణువు కౌస్తుభమణితో పాటు మహా లక్ష్మిని తన వక్ష స్థలంపై విరాజిల్ల చేశాడట. 

ఇలా క్షీర సాగర మథనంలో పుట్టిన లక్ష్మీదేవి శ్రీ మహా విష్ణువు సొంతం అయింది. క్షీర సాగర మథనంలో పుట్టిన ముఖ్యమైన వాటినన్నింటినీ దేవతల్లోని ముఖ్యులు తీసుకున్నారు. రాక్షసులు మాత్రం కేవలం సురాపాణం తీసుకొని మత్తుగా తాము క్షీర సాగర మథనం చిలికేందుకు పడిన శ్రమను పోగొట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube