ముత్యాన్ని ఎవరు ధరించాలి... ముత్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సాధారణంగా మన హిందువులు అనేక ఆచార వ్యవహారాలతో పాటు జాతక దోషాలను జాతకాలను కూడా ఎక్కువగా నమ్ముతారు.ఈ క్రమంలోనే మనం పుట్టిన తేదీ సమయం బట్టి మన జాతకం ఎలా ఉందో జ్యోతిష్యశాస్త్ర నిపుణులను అడిగి తెలుసుకుంటారు.

 Who Should Wear The Pearl What Are The Benefits Of Wearing Pearls-TeluguStop.com

ఈ క్రమంలోనే మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అందుకు పరిష్కార మార్గాలను చెబుతుంటారు.ఈ క్రమంలోనే చాలామంది ముత్యం ధరించాలని చెబుతారు.

మరి ముత్యం ఏ రాశి వారు ధరించాలి? ముత్యం ధరించడం వల్ల ఏవిధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Who Should Wear The Pearl What Are The Benefits Of Wearing Pearls-ముత్యాన్ని ఎవరు ధరించాలి… ముత్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుపు రంగులో ఉన్నటువంటి ముత్యాలను చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతత ఉంటుంది.

చాలామంది మనసు ప్రశాంతత కోసమే ముత్యాలను ఎక్కువగా ధరిస్తుంటారు.సాధారణంగా ముత్యాలు ఎవరి పై ఎలాంటి నెగెటివ్ ప్రభావాన్ని చూపవు కనుక వీటిని ఎవరైనా ధరించవచ్చు.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ఉండటం కోసం ముత్యాలు ధరించాలని చెబుతారు.ముత్యాలను ముఖ్యంగా మీన రాశి, సింహరాశి, ధనస్సు రాశి వారు ధరించాలని చెబుతారు.

Telugu Astrology, Benefits, Hindu Tradition, Hindus, Horocopes, Jyotishyam, Pearl, Pearls To Fingers, Positive Energy, White Pearls-Telugu Bhakthi

సాధారణంగా తొందరగా కోపం వచ్చే వారు, ఆ కోపంపై కంట్రోల్ లేని వారు ముత్యాలు ధరిస్తారు.ఈ క్రమంలోనే చాలామంది వారి మనసును స్థిరంగా ఉంచుకోవడం కోసం ముత్యాలు ధరించడం జరుగుతుంది.చాలామంది వీటిని వేలికి ఉంగరంగాను లేదా మెడలో హారంగాను ధరిస్తారు.ఇలా ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఎప్పుడు సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు.

అయితే ముత్యాలను ధరించేవారు ఎల్లప్పుడూ కుడి చేయి చిటికిన వేలుకు మాత్రమే ధరించాలి.

Telugu Astrology, Benefits, Hindu Tradition, Hindus, Horocopes, Jyotishyam, Pearl, Pearls To Fingers, Positive Energy, White Pearls-Telugu Bhakthi

అదేవిధంగా ముత్యాన్ని వెండితో తయారుచేసిన ఉంగరానికి వేసుకోవడం చాలా మంచిది.చాలామంది బంగారుతో తయారుచేసిన ఉంగరానికి కూడా ముత్యాన్ని వేయించి వేలికి తొడుగుతారు.ఇలా అయినా కూడా తొడగవచ్చు.

ఈ విధంగా ముత్యం ధరించడం వల్ల మన చుట్టూ ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.అందుకోసమే చాలామంది ముత్యాలని ధరించడానికి ఇష్టపడుతుంటారు.

#Energy #Hindus #Jyotishyam #Horocopes #White Pearls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU