అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి?

అశ్వమేధ యాగం గురించి మనం రామాయణంలో విన్నాం.లవ కుశులు పుట్టాక శ్రీ రామ చంద్రుడు ఈ అశ్వమేధ యాగాన్ని చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

 Who Should Perform Ashwamedha Yagam, Ashwamedha Yagam , Horse, Male Horse ,sun-TeluguStop.com

ఈ యాగానికి వాడిన గుర్రాన్నే లవ కుశులు ఆపారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే.అయితే ఈ అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి.

యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం.అలాగే తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ఈ అశ్వమేధ యాగాన్ని చేస్తుంటారు.

 Who Should Perform Ashwamedha Yagam, Ashwamedha Yagam , Horse, Male Horse ,sun-అశ్వమేధ యాగం ఎవరు, ఎందుకు చేయాలి-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు.ముందుగా గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.

ఆ తర్వాత ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు.ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ.

ఒక్క కుక్కను చంపి సంకేతంగా శిక్షను తెలియజేస్తారు.

ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సర కాలం యధేచ్చగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు.

ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు.అశ్వం శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు.

గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందుల నుండి కాపాడటానికి తోడుగా రాజ కుమారులు లేదా సేనాధిపతులు ఉంటారు.నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞ యాగాదులు జరుపుతారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube